సునీల్.. ఈసారి కొంచెం నయం

సునీల్.. ఈసారి కొంచెం నయం

హీరో వేషాలతో బాగా విసుగెత్తించేసిన నటుడు సునీల్. కమెడియన్‌గా స్వర్ణయుగం చూసిన అతను.. అనుకోకుండా హీరోగా మారి మొదట్లో బాగానే మెప్పించాడు. కానీ తనకు నప్పే కామెడీ హీరో వేషాలకు పరిమితం కాకుండా రెగ్యులర్ హీరోల్లా యాక్షన్, డ్యాన్స్ అంటూ విన్యాసాలు చేసి వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాడు. హీరోగా దారుణాతి దారుణమైన ఫలితాలు ఎదుర్కొని పూర్తిగా మార్కెట్ దెబ్బ తీసుకున్నాక మళ్లీ కామెడీ వేషాల వైపు అడుగులేశాడు. అయితే అతడిలో మునుపటి కామెడీ టచ్ మిస్సవడంతో జనాల్ని నవ్వించలేకపోయాడు.

సిల్లీ ఫెలోస్, అరవింద సమేత, అమర్ అక్బర్ ఆంటోనీ, పడి పడి లేచె మనసు.. ఇలా కమెడియన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎందులోనూ సునీల్ మెప్పించలేకపోయాడు. వీటిలో ‘అరవింద సమేత’ బాగా ఆడినా కూడా సునీల్ పాత్ర మాత్రం పండలేదు. ఒకప్పుడు సునీల్‌తో అదిరిపోయే కామెడీ పండించిన త్రివిక్రమ్ సైతం ఫెయిలవడంతో సునీల్ భవితవ్యం అగమ్య గోచరంగా కనిపించింది. ఐతే ఎట్టకేలకు సునీల్ ఒక చిత్రంలో తన కామెడీతో మెప్పించగలిగాడు. అదే.. చిత్రలహరి. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో సునీల్ పాత్ర పర్వాలేదనిపించింది.

మరీ పేలిపోయే కామెడీ కాదు కానీ.. ఉన్నంతలో బాగా నవ్వించింది. సునీల్ కనిపించినంత సేపూ ప్రతి సీన్లోనూ ప్రేక్షకులకు వినోదం పంచగలిగాడు. ఈ ఊపులో ఇలాగే కొన్ని మంచి పాత్రలు పడితే సునీల్ మళ్లీ తన కామెడీ టచ్ అందుకున్నట్లే. అతడి సెకండ్ ఇన్నింగ్స్ సెట్టయినట్లే.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English