హ్యాట్రిక్ హీరోను నమ్మారు.. డబుల్ హ్యాట్రిక్ హీరోను నమ్మట్లేదు

హ్యాట్రిక్ హీరోను నమ్మారు.. డబుల్ హ్యాట్రిక్ హీరోను నమ్మట్లేదు

ఎలాంటి హీరోకైనా వరుసగా రెండు మూడు ఫ్లాపులు పడ్డాయంటే మార్కెట్ డౌన్ అవుతుంది. తర్వాతి సినిమాలపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. వాటికి హైప్ తీసుకురావడం కష్టం. ఐతే అక్కినేని నాగచైతన్య వరుసగా మూడు ఫ్లాపులు ఇచ్చినా కూడా అతడి కొత్త సినిమా ‘మజిలీ’కి బజ్ క్రియేట్ చేయలిగారు. గత సినిమాల నెగెటివిటీ ఏమీ దీనిపై పడలేదు. చైతూ ఎప్పుడు లవ్ స్టోరీ చేసినా దానికి హైప్ వస్తుంది. వాటికి అతను పర్ఫెక్టుగా సూటవుతాడు. చైతూకు ఉన్న ఇమేజ్‌ను వాడుకుని దర్శకులు కూడా ప్రేమకథల్ని చక్కగా తీర్చిదిద్దుతుంటారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ సైతం ‘మజిలీ’ని అందంగా తీశాడు. దీనికి ఆసక్తికర ప్రోమోలు కూడా కట్ చేసి జనాల్లో ఆసక్తి రేకెత్తించగలిగాడు. విడుదలకు ముందున్న అంచనాల్ని అందుకునేలా సినిమా ఉండటంతో దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు లాభాల్లో ఉంది.

ఐతే ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టిన చైతూను నమ్మినట్లు డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపుల హీరో సాయిధరమ్ తేజ్‌ను నమ్మట్లేదు జనాలు. అతడి కొత్త సినిమా ‘చిత్రలహరి’కి ఆశించిన బజ్ కనిపించడం లేదు. దీని టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. ఆడియో కూడా మెప్పించింది. అయినా సినిమాకు బజ్ తక్కువగానే ఉంది. బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కానుండగా.. బుక్ మై షోలో స్క్రీన్లలో చాలా వరకు గ్రీన్ కలర్లోనే కనిపిస్తున్నాయి. అయితే ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.12 కోట్లకే అమ్మారు కాబట్టి బయ్యర్లకు భయం లేదనే భావిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కీలకం. ఆ టాక్ కనుక వస్తే.. సమ్మర్ సీజన్ కాబట్టి ఆటోమేటిగ్గా వసూళ్లు బాగుంటాయని ఈజీగా బ్రేక్ ఈవెన్‌కు వచ్చేస్తుందని భావిస్తున్నారు. ఈ రోజంతా జనాలు ఎన్నికల హడావుడిలో ఉండటం వల్ల బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని.. రేప్పొద్దన టాక్ బాగుంటే సినిమా కచ్చితంగా పుంజుకుంటుందని ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English