చైతూ కాదు అఖిల్ అట..

చైతూ కాదు అఖిల్ అట..

టాలీవుడ్లో సీక్వెల్స్, ప్రీక్వెల్స్ చాలా చాలా తక్కువ. అక్కినేని నాగార్జున ఇప్పటిదాకా తన కెరీర్లో ఒక్క సీక్వెల్/ప్రీక్వెల్‌లో కూడా నటించలేదు. ఐతే ఇప్పుడాయన తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ‘సోగ్గాడే చిన్నినాయనా’కు కొనసాగింపుగా ప్రీక్వెల్ చేయబోతున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘సోగ్గాడే..’ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన బంగార్రాజు పాత్రను తీసుకుని దాని చుట్టూ కథను అల్లి ఈ సినిమా తీయబోతున్నారు. ‘సోగ్గాడే..’తో లింక్ ఏమీ లేకుండా.. బంగార్రాజు కథను వేరుగా చూపించబోతున్నారు. ‘సోగ్గాడే..’లో నాగ్ ద్విపాత్రాభినయం చేయగా.. ‘బంగార్రాజు’లో ఆయన పాత్ర ఒక్కటే ఉంటుందట. బంగార్రాజు మనవడి పాత్ర ఇందులో కీలకంగా ఉంటుందని సమాచారం.

ఈ పాత్రకు ముందు నాగచైతన్య పేరు వినిపించింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమాలో తాను నటించడం గురించి చైతూ మాట్లాడాడు. కానీ తాజా సమాచారం ఏంటంటే.. ‘బంగార్రాజు’లో నాగ్‌కు తోడుగా చైతూ నటించట్లేదట. అఖిల్‌కు ఆ అవకాశం ఇస్తున్నారట. ఈ సినిమా స్క్రిప్టుపై నాగ్‌కు మంచి నమ్మకం కుదరడంతో.. తన చిన్న కొడుక్కి సక్సెస్ ఇవ్వడానికి ఇది మంచి అవకాశం అని నాగ్ భావించాడట. పైగా సినిమాలో మనవడి పాత్ర కూడా బంగర్రాజు తరహాలోనే ప్లేబాయ్ లాగా ఉంటుందట. దానికి అఖిలే బాగా సూటవుతాడని భావించాడట నాగ్.

‘సోగ్గాడే..’తో దర్శకుడిగా పరిచయం అయిన కళ్యాణ్ కృష్ణ కురసాలనే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. అతను రెండేళ్లుగా ఈ కథ మీద పని చేస్తున్నాడు. సీనియర్ రచయిత సత్యానంద్ సహకారంతో అతను స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. దాదాపుగా స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తన సొంత నిర్మాణ సంస్థలో నాగ్ ఈ సినిమా చేయనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English