అల్లు అర్జున్‌ని నమ్మలేం

అల్లు అర్జున్‌ని నమ్మలేం

అల్లు అర్జున్‌ ఒక ఏడాది కాలంగా సినిమా ఏదీ చేయలేదనే అసంతృప్తి అభిమానుల్లో వున్నా కానీ ఈ పుట్టినరోజుకి మూడు సినిమాలు అనౌన్స్‌ చేయడంతో ఇక మళ్లీ బన్నీకి గ్యాప్‌ రాదని వారంతా ఆనందిస్తున్నారు. త్రివిక్రమ్‌తో 'నాన్న నేను' అనే చిత్రాన్ని అల్లు అర్జున్‌ త్వరలోనే స్టార్ట్‌ చేయనున్నాడు. తర్వాతి రెండు చిత్రాల్లో ఒకటి సుకుమార్‌తో, మరొకటి వేణు శ్రీరామ్‌తో చేస్తానని ప్రకటించాడు.

అయితే అల్లు అర్జున్‌నుంచి ప్రకటనలు రావడం, అవి నిజం కాకపోవడం మామూలైపోయింది. గత పుట్టినరోజుకి విక్రమ్‌కుమార్‌తో సినిమా వుంటుందని అనౌన్స్‌ చేసాడు కానీ చివరకు వదిలేసాడు. ఆ చిత్రాన్ని ప్రస్తుతం నాని 'గ్యాంగ్‌లీడర్‌' పేరుతో చేస్తున్నాడు. అలాగే తమిళ దర్శకుడు లింగుస్వామితో కూడా ద్విభాషా చిత్రాన్ని ప్రకటించాడు కానీ నిజం కాలేదు.

కనుక త్రివిక్రమ్‌ సినిమా తప్పించి మిగతా రెండు సినిమాలు సెట్స్‌ మీదకి వెళ్లే వరకు బన్నీ మనసు మార్చుకుంటాడా లేదా అనే దానిపై గ్యారెంటీ వుండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English