చైతు, సమంత మధ్యలోకి వెళ్తే అంతే!

చైతు, సమంత మధ్యలోకి వెళ్తే అంతే!

'మజిలీ' చిత్రం విజయం సాధించిందని నాగచైతన్య రిలీఫ్‌ ఫీలవుతున్నాడు. వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయానందంతో ఆనందిస్తున్నాడు. సమంతకి ఇలాంటి విజయాలు కొత్త కాకపోయినా కానీ పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి నటించిన తొలి చిత్రం సక్సెస్‌ అయిందని ఆమె కూడా సంబర పడుతోంది.

అయితే ఈ చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న దివ్యాంశ కౌశిక్‌కి మాత్రం ఎలాంటి ఆనందం లేదు. ఈ చిత్రంలో దివ్యాంశది చాలా కీలక పాత్ర. ఇద్దరు హీరోయిన్లుంటే సమంత కథ సెకండ్‌ హాఫ్‌లో కానీ బిగిన్‌ అవదు. అంటే కథానాయికగా దివ్యాంశకి కూడా సమంతకి దక్కినంత స్క్రీన్‌ స్పేస్‌ దక్కింది. అయితే తొలి సినిమాతో విజయం సాధించిన ఆనందం మాత్రం ఆమెకి లేదు పాపం. ఎందుకంటే ఈ చిత్రాన్ని సమంత హైజాక్‌ చేసేసింది.

ఆమె నటనకి అద్భుతమైన ప్రశంసలు వస్తూ వుండడంతో ఇందులో మరో హీరోయిన్‌ వుందనే విషయాన్ని మీడియా కూడా విస్మరిస్తోంది. దీంతో తనకి కనీస గుర్తింపు రావడం లేదని దివ్యాంశ ఫీలవుతోంది. బహుశా నార్త్‌ ఇండియన్‌ కావడం వల్ల ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నట్టుంది. లేదంటే చైతు, సమంత మధ్యలో వేరే వాళ్లకి క్రెడిట్‌ వస్తుందని ఎలా ఆశిస్తుంది?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English