తేజ పూర్వపు ఫామ్ అందుకున్నాడా?

తేజ పూర్వపు ఫామ్ అందుకున్నాడా?

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు ముందు దర్శకుడు తేజ పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. ఎప్పుడో దశాబ్దంన్నర కిందట ‘జయం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్న తేజ.. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్టు కొట్టలేకపోయాడు. అతడి నుంచి యావరేజ్ సినిమా కూడా రాలేదు.

రెండంకెల సంఖ్యలో డిజాస్టర్లు ఇచ్చి తన మీద ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాడు తేజ. అలాంటి దర్శకుడిని దగ్గుబాటి రానా, సురేష్ నమ్మడం ఆశ్చర్యం కలిగించింది. కానీ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంచి విజయాన్నందించాడు తేజ. కానీ ఆ చిత్రం చూస్తే అందులో తేజ మార్కు పెద్దగా కనిపించదు. అతడి గత చిత్రాల ఛాయలేమీ అందులో కనిపించవు. అది అసలు తేజ సినిమానేనా అని ఆశ్చర్యం కలుగుతుంది.

ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు తేజ నుంచి ‘సీత’ అనే సినిమా రాబోతోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ చేయాల్సిన తేజ అనూహ్య పరిస్థితుల్లో ఆ సినిమా వదులుకుని తీసిన చిత్రమిది. బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ అగర్వాల్‌ల ఆసక్తికర కాంబినేషన్లో ఈ సినిమా తీశాడు తేజ. ముందు ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ టీజర్ చూశాక ఆ నమ్మకం సడలింది. పేలవంగా అనిపించిన టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఏమంత ఆసక్తి పెంచలేకపోయింది. దర్శకుడిగా తేజ ఏ మెరుపులూ చూపించలేకపోయాడు. తాజాగా సినిమాలోని బుల్ రెడ్డి పాట వీడియో ప్రోమో వదిలారు.

అది కూడా పేలవంగా అనిపించింది. ఏ విధమైన ప్రత్యేకతా కనిపించలేదు ఆ పాటలో. ముందు ఈ పాట గురించి ఓ రేంజిలో చెప్పారు. తీరా చూస్తే అందులో అంత విషయం లేదు. వరుసగా ప్రోమోలన్నీ చూస్తుంటే తేజ పూర్వపు ఫామ్ అందుకున్నాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి ‘సీత’ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English