‘జీరో’ క్యారెక్టర్‌తో ‘హీరో’ అవుతాడా?

‘జీరో’ క్యారెక్టర్‌తో ‘హీరో’ అవుతాడా?

ఒకటి.. రెండు.. మూడు.. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతూనే ఉంటే ఆరు ఫ్లాపులు పూర్తయిపోయాయి. డబుల్ హ్యాట్రిక్ కొట్టేసి జంక్షన్లో వచ్చి నిలబడ్డాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఫ్లాపులు వచ్చాయి అతడికి. దీంతో మార్కెట్ దెబ్బ తినేసింది. ఒక రకమైన నైరాశ్యంలోకి వెళ్లిపోయాడతను. ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొంచెం గ్యాప్ తీసుకుని కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేశాడు. ఈ సినిమా ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. దీని టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. సినీ కెరీర్లో తేజు ఇప్పుడెలాంటి పరిస్థితిలో ఉన్నాడో.. ‘చిత్రలహరి’ సినిమాలో అతడి క్యారెక్టర్ కూడా అలాంటిదే.

సక్సెస్ రుచి చూడలేక తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడే క్యారెక్టర్ అతడిది. జీవితంలో జీరో అయిపోయి.. ఎలా తన జీవితం బాగుపడుతుందా అని ఎదురు చూసే పాత్రలో అతను కనిపిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి కష్టాల్ని ఎదిరించి జీవితంలో గెలిస్తే వచ్చే కిక్కే వేరు. అలాంటి క్యారెక్టర్లు జనాలకు ఈజీగా కనెక్టవుతాయి. కాబట్టే ఈ సినిమా బాగా ఆడొచ్చన్న ఆశతో ఉన్నాడు తేజు. సినిమాలో మంచి ఫీల్, ఎమోషన్ ఉండేట్లే కనిపిస్తోంది. మరి ఒక ఫెయిల్యూర్ క్యారెక్టర్ ద్వారా తేజు సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. ‘చిత్రలహరి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో తేజు సరసన నివేథా పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటించారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English