ఆర్‌ఆర్‌ఆర్‌... బాహుబలి కంటే కష్టం!

ఆర్‌ఆర్‌ఆర్‌... బాహుబలి కంటే కష్టం!

బాహుబలి లాంటి భారీ సరంజామా వున్న సినిమా కాకపోయినా కానీ ఇద్దరు అగ్ర నటులని ఒక్కటి చేసి సినిమా తీయడం అంత తేలికయిన విషయం కాదని రాజమౌళికి తెలిసి వస్తోంది. బాహుబలి చిత్రం షెడ్యూల్స్‌ ఎప్పుడూ అప్‌సెట్‌ అవలేదు. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎప్పటికప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాంబినేషన్‌ సీన్లు ఎక్కువ వుండడం వల్ల ఇద్దరు హీరోలు అందుబాటులో వుండడం తప్పనిసరి. ఒక హీరో లేనపుడు మరో హీరో సీన్లు తీసేయడం కూడా కుదరడం లేదు. చరణ్‌ కాలికి గాయం కావడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ షూట్‌ బాగా అప్‌సెట్‌ అయింది.

ఆలియా భట్‌తో సన్నివేశాలు తీయాలని రాజమౌళి ప్లాన్‌ చేసుకుంటే, చరణ్‌ గాయం వల్ల అది కుదరలేదు. మళ్లీ ఆలియా డేట్లు ఎప్పుడు దొరుకుతాయో తెలియదు. ఇప్పటికే ఎన్టీఆర్‌ సరసన ఎంపిక చేసిన డెయిసీ జోన్స్‌ని తొలగించారు. ఆలియా బిజీ షెడ్యూల్స్‌ వల్ల ఆమె ఈ చిత్రాన్ని వదలకుండా వుంటుందా అనేది అనుమానమే. ఇంతవరకు ఆమెపై సన్నివేశాలేవీ తీయకపోవడం కూడా ఆమెకి దోహదపడుతుంది. ఒకవేళ డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకపోతే సారీ చెప్పేయవచ్చు. ఈ ఏడాది చివర్లోగా సినిమా పూర్తి చేసేయాలని భావించిన రాజమౌళికి అది సాధ్యపడుతుందా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English