పవన్‌ సినిమా మళ్లీ అటకెక్కింది

పవన్‌ సినిమా మళ్లీ అటకెక్కింది

పవన్‌తో చేయాలని తమిళ తెరి చిత్ర కథకి సంతోష్‌ శ్రీనివాస్‌ మార్పు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో పోలీసోడు పేరిట విడుదలయినా కానీ పవన్‌ ఇమేజ్‌కి సూటవుతుందని దానిని రీమేక్‌ చేయాలని చూసారు. అయితే పవన్‌ రాజకీయాలతో బిజీ అవడంతో ఆ కథ రవితేజ వద్దకి వెళ్లింది. మొదట్లో ఆసక్తి చూపించిన రవితేజ వరుస పరాజయాలకి భయపడి ఈ చిత్రాన్ని వదిలేసుకున్నాడు. కానీ డిస్కో రాజా చిత్రం లేటవుతోందని మళ్లీ దీనిని లైన్లోకి తెచ్చాడు. రవితేజ, సంతోష్‌ శ్రీనివాస్‌ రెడీగా వున్నా కానీ ఈసారి మైత్రి మూవీ మేకర్స్‌ ప్లేట్‌ తిప్పేసారు.

ఇటీవలి కాలంలో కమర్షియల్‌ చిత్రాలకి తెలుగునాట ఆదరణ దక్కడం లేదని, తెలిసి తెలిసీ ఈ చిత్రం చేయడం ఆత్మహత్యాసదృశం అవుతుందని భావించి వద్దని చెప్పేసారు. రవితేజకి ఇచ్చిన అడ్వాన్స్‌ అయితే వెనక్కి తీసుకోలేదు. ఏదైనా మంచి కథ దొరికితే చేద్దామని తేల్చేసారు. రవితేజకి వేరే సినిమా వుంది కానీ, దీనిపై ఏడాదికి పైగా శ్రమ పడిన సంతోష్‌ శ్రీనివాస్‌ ఇప్పుడు మరో హీరోని కన్విన్స్‌ చేసుకునే పనిలో పడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English