బుకింగ్స్‌ బాగా వీక్‌ అబ్బాయ్‌!

బుకింగ్స్‌ బాగా వీక్‌ అబ్బాయ్‌!

ఆరు ఫ్లాపుల తర్వాత జాతకం మారుతుందని సాయి ధరమ్‌ తేజ్‌ 'చిత్రలహరి'పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. విడుదలకి ముందు అయితే ఈ చిత్రానికి అంత సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. గత ఆరు చిత్రాలు దారుణంగా ఫ్లాపవడంతో తేజ్‌ మార్కెట్‌ బాగా దెబ్బ తినేసింది. ఇతడి సినిమాలు చూడవచ్చునని ఫిక్సయిన మెగా అభిమానులు కూడా మెల్లగా సైడ్‌ అయిపోయారు. ఆ ఎఫెక్ట్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై బాగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో చూసేందుకు మజిలీ తప్ప మరో సినిమా లేదు. చిత్రలహరి పాటలు బాగానే వున్నాయి.

ట్రెయిలర్లకి కూడా స్పందన బాగుంది. మామూలుగా అయితే బుకింగ్స్‌ బాగా స్పీడుగా వుండాలి. కానీ చిత్రలహరి బుకింగ్స్‌ చాలా వీక్‌గా వున్నాయి. విడుదలకి మధ్యలో ఒక రోజు వుంది కనుక పుంజుకుంటాయని మేకర్లు, బయ్యర్లు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫోకస్‌ అంతా రాజకీయాలపై వుండడంతో ఎన్నికలయిన తర్వాత సినిమా వైపు దృష్టి సారిస్తారని, ఎన్నికల తర్వాతి రోజు విడుదల కావడం ఈ చిత్రానికి లాభమని సినీ విశ్లేషకులు, ట్రేడ్‌ వర్గాల వారు భావిస్తున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రం విజయవంతం కావాలని సాయి తేజ్‌ తిరుమలకి వెళ్లి శ్రీవారిని సందర్శించుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English