సంపూ.. ఆరేళ్లు వెనక్కి వెళ్తే

సంపూ.. ఆరేళ్లు వెనక్కి వెళ్తే

ఎక్కడో కరీంనగర్లో బంగారం పని చేసుకుని అతి సామాన్య వక్తి నరసింహాచారి. భార్య, ఒక పాపతో అతి సాధారణ జీవితం గడుపుతున్న వాడు అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. కమెడియన్ లుక్ ఉండే అతను.. హీరోగా నటించాడు. అతడి తొలి సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. మరిన్ని సినిమాల్లో అవకాశాలు తెచ్చింది. అతడి జీవితాన్ని మార్చేసింది. ఈ ఉపోద్ఘాతమంతా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లోకి రాకముందు తన జీవితం ఎలా ఉండేదో.. ఆరేళ్ల కిందట తాను ఎలాంటి స్థితిలో ఉన్నానో వివరిస్తూ అతను ఆసక్తికర విశేషాలు చెప్పాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

‘‘మాది కరీంనగర్. నేను గోల్డ్‌షాప్‌లో వర్కర్‌ని. నెలకు 15 వేల రూపాయలు వచ్చేవి. మంచి సీజన్‌ ఉంటే రూ.30 వేలు వచ్చేవి. ఒక్కో నెలలో ఏమీ వచ్చేవి కావు. నా జీవితం చాలా చిన్నది. ఒక స్కూటర్‌.. చిన్న షాప్‌.. దానికి నెలకు అద్దె రూ.2 వేలు. ఉదయాన్నే లేచి టిఫిన్‌ చేసి. షాపుకెళ్లి పనిచేసుకోవడం.. సాయంత్రం ఇంటికి రావడం.. రోజూ ఇదే నా దినచర్య. హైదరాబాద్‌‌కు వస్తే ఒక ఐదారొందలు ఖర్చు అయ్యేవి. అదే పెద్ద మొత్తం. ఐతే సినిమాల్లో నటించాలని చాలా కోరికగా ఉండేది. అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో నేను ఏదైనా యాక్ట్ చేసి వీడియో రికార్డ్ చేసి.. ఆ సీడీని సినిమా వాళ్లకు ఇస్తే వాళ్లు చూసి ఆడిషన్‌కు పిలుస్తారని చిన్న ఆశ. కానీ, అది చేయడానికి కూడా డబ్బుల్లేవు. ఇలా జీవితం సాగుతున్న రోజుల్లో అనుకోకుండా నన్ను చూసిన సాయి రాజేష్ ‘హృదయకాలేయం’లో నటించే అవకాశం ఇచ్చాడు. ఇదే విషయాన్ని నా భార్యకు చెబితే..‘నీకేమైనా పిచ్చా. నిజంగా నీతో సినిమా చేస్తారా?’ అన్నట్లుగా మాట్లాడింది. అప్పటికే నేను ఒక పాపకు తండ్రిని కూడా. నా లుక్ ఏమంత బాగుండదు. అలాంటి నాతో ఎవరు సినిమా చేస్తారని ఆమె ఫీలింగ్. కానీ అనుకోనిది జరిగింది. నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు. ఆ సినిమా హిట్ కూా అయింది’’ అని సంపూ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English