నాగశౌర్య.. ఇంకోటి క్యాన్సిల్ చేసి పడేశాడు

నాగశౌర్య.. ఇంకోటి క్యాన్సిల్ చేసి పడేశాడు

యువ కథానాయకుడు నాగశౌర్య కెరీర్ అయోమయంలో పడ్డట్లు కనిపిస్తోంది. పోయినేడాది ఇదే సమయానికి శౌర్య మామూలు ఉత్సాహంలో లేడు. ‘ఛలో’ తన కెరీర్లోనే అతి పెద్ద హిట్‌గా నిలవడంతో అతను మంచి ఊపు మీద కనిపించాడు. కానీ ఆ విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. చూస్తుండగానే ఫేడవుట్ అయిపోయాడు.
ఆరునెలలు తిరిగేసరికి మూడు ఫ్లాపులొచ్చాయి. ‘కణం’.. ‘అమ్మమ్మగారిల్లు’.. ‘నర్తనశాల’ ఈ మూడు నిరాశ పరిచాయి. దీనికి తోడు అతను సెట్ చేసుకున్న కొత్త సినిమాలూ ముందుకు కదలట్లేదు. ఈ ఫ్లాపులతో సంబంధం లేకుండా మూడు ప్రాజెక్టులు కమిటయ్యాడు శౌర్య. కానీ వాటిలో రెండు క్యాన్సిల్ అయిపోవడం ఆశ్చర్యకరం.

ఆల్రెడీ సుకుమార్ నిర్మాణంలో అతడి శిష్యుడు కాశి తీయాల్సిన సినిమా ఆగిపోయినట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇది శౌర్య నిర్ణయమే అంటున్నారు. దీంతో పాటు మరో సినిమాను శౌర్య రద్దు చేసుకున్నాడట. గత ఏడాది శౌర్య హీరోగా రాజా కొలుసు అనే కొత్త దర్శకుడితో నిర్మాత ఆనంద్ ప్రసాద్ ‘భవ్య క్రియేషన్స్’ బేనర్ మీద ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ తర్వాత వార్తల్లోనే లేదు. మధ్యలో ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో దీన్ని ఒకటిగా చెప్పాడు శౌర్య.

ఐతే ఈ చిత్రాన్ని అనివార్య కారణాలతో ఆపేసినట్లు సమాచారం. శౌర్యనే ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్ ప్రొడక్షన్లో సినిమా క్యాన్సిల్ కావడానికి శౌర్య యాటిట్యూడే కారణమన్న గుసగుసలు వినిపిస్తుండగా.. ఈ చిత్రం నుంచి కూడా అతనే బయటికి వచ్చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఇక అవసరాల శ్రీనివాస్ సినిమా మాత్రమే శౌర్య చేతిలో ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English