ముక్కు పగిలింది.. పక్కకెళ్లింది

ముక్కు పగిలింది.. పక్కకెళ్లింది

‘జెర్సీ’ సినిమా కోసం నాని ఎంత కష్టపడ్డాడో ఈ మధ్య రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో అందరికీ అర్థమైంది. ఈ సినిమా కోసం ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా 70 రోజుల పాటు ఒక క్రికెట్ కోచ్ ఆధ్వర్యంలో నాని సీరియస్‌గా క్రికెట్ సాధన చేయడం విశేషం. సాధన సమయంలో, షూటింగ్‌లో అతడికి పెద్ద పెద్ద గాయాలు కూడా అయ్యాయట. ఈ చిత్రం నుంచి కొత్త పాట లాంచ్ చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాని సినిమా కోసం పడ్డ కష్టాన్ని, ఈ చిత్రంతో తనకున్న భావోద్వేగ బంధాన్ని వివరించాడు.

‘‘జెర్సీ సినిమా కోసం మామూలుగా దెబ్బలు తినలేదు.. ముక్కు విరిగిపోయి, పక్కకు వెళ్లిపోయింది. ఐతే సినిమా చూస్తున్న వారు అర్జున్‌ అనేవాడు అంత మంచి క్రికెటర్‌ అని నమ్మకపోతే సినిమా అంతా పాడైపోతుంది. అందుకే సిినిమాకు, ఆ పాత్రకు అథెంటిసిటీ తేవడానికి చాలా కష్టపడ్డాం. అన్ని దెబ్బలు తగిలినా.. కష్టపడినా.. సినిమా చూసిన తర్వాత సంతృప్తిగా అనిపించింది. ఈ సినిమా పూర్తి చేశాక చాలా ఉద్వేగానికి గురయ్యాను. నా ప్రతి సినిమా షూటింగ్‌ చివరి రోజున.. ఈ దుస్తులు ఆఖరి సారి వేసుకుంటున్నాను, ఇదే ఆఖరి రోజు, రేపటి నుంచి ఈ యాసలో మాట్లాడను.. అనే ఫీలింగ్‌ తప్పితే భావోద్వేగానికి గురయ్యేవాడ్ని కాదు. కానీ ‘జెర్సీ’ ఆఖరి రోజున మాత్రం.. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఓ స్నేహితుడికి గుడ్ బై చెబుతున్న ఫీలింగ్‌ వచ్చేసింది. ఈ రోజు నుంచి వాడ్ని నేను కలవలేనా అనిపించింది. నా కెరీర్‌లో సినిమా చివరి రోజున అంత బరువెక్కిన హృదయంతో ఇంటికి వెళ్లడం అదే తొలిసారి’’ అని నాని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English