ఫ్యాన్స్ మొక్కలతో అల్లూ వారి తోట

ఫ్యాన్స్ మొక్కలతో అల్లూ వారి తోట

ఈ మధ్యన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే.. ఎవరికైనా ఏదైనా వస్తువును గిఫ్టుగా ఇచ్చే బదులు.. ఒక మొక్కను గిఫ్టుగా ఇస్తే.. అది కలకాలం ఉంటుంది అంటూ.. ఖరీదైన మొక్కలను పెళ్ళిళ్లకూ బర్తడే పార్టీలకూ బహుమతిగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ట్రెండ్ బాగానే నడుస్తోంది. అందుకే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తనకు ఎవరైనా గిఫ్టిస్తే మొక్కలను ఇవ్వడంటూ కామెంట్ చేశాడు.

నవదీప్ ఓపెన్ చేసిన ఒక మినీ స్టూడియో ఓపెనింగుకు విచ్చేసిన బన్నీ, నాకు మొక్కను గిఫ్టుగా ఇచ్చావ్ థ్యాంక్స్ అంటూ.. ఎవరైనా ఇలా మొక్కలను ఇస్తే తన ఫామ్ హౌస్ లో వాటితో ఒక తోటను పెంచుతాను అంటూ కామెంట్ చేశాడు. అయితే నవదీప్ వంటి డబ్బున్న యాక్టర్లు ఫైకస్ రెలీజియోజ వంటి ఖరీదైన మొక్కలను గిఫ్టుగా ఇచ్చారు కాని, నిన్న పుట్టినరోజు వేడుకలకు వచ్చిన అభిమానులు మాత్రం సాధారణంగా దొరికే క్రోటన్స్ మొక్కలను ఇతర ఇండోర్ చెట్లను గిఫ్టుగా ఇచ్చేశారు. అవన్నీ తన ఫామ్ హౌస్ కు తరలించిన బన్నీ.. ఆ మొక్కలతో  తోట పెంచబోతున్నాడట.

ఇకపోతే అల్లు అర్జున్ తన కొత్త సినిమా షూటింగ్ ను ఏప్రియల్ 24 నుండి మొదలుపెడుతున్నాడు. ఆలోపు జనసేన కోసం ఒక రెండు రోజులు.. అలాగే సమ్మర్లో ఫ్యామిలీ టూర్ కోసం మరో వారం కేటాయిస్తాడట. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English