ఆ పిల్ల దెయ్యం కాదు కదా..?

ఆ పిల్ల దెయ్యం కాదు కదా..?

పెద్ద పెద్ద కళ్లతో..అమాయకత్వం నిండిన మోముతో..నీకు నాకు డాష్‌ డాష్‌ ..అంటూ తెరపైకి వచ్చిన తెలుగమ్మాయి, విజయనగరం భామ నందిత రెండో సినిమాతోనే ప్రయోగం చేస్తోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ అమ్మడు నటించిన లేటెస్ట్‌ సినిమా ‘ప్రేమకథా చిత్రమ్‌’ చూస్తుంటే గతంలో రిలీజైన తమిళ అనువాద చిత్రం ‘పిజ్జా’ని తలపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్స్‌ చూస్తుంటే ఒక దెయ్యం కథలా ఉంది..సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని కూడా అనిపించేలా ఉంది.. కెరియర్‌లో రెండో సినిమాను చేస్తున్న నందిత ఇలాంటి దెయ్యాల క్యారెక్టర్లు చేస్తే, చివరకు ఆర్టు సినిమా హారోయిన్‌లా మిగిలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

పైగా ఈ సినిమాని 'ఈరోజుల్లో', 'బస్‌స్టాప్‌' లాంటి హాట్‌స్టఫ్‌ ఉన్న చిత్రాల్ని తీసిన దర్శకుడు మారుతి సొంత ప్రొడక్షన్‌ హౌస్‌లో నిర్మించి రిలీజ్‌ చేస్తున్నాడు. మారుతి సినిమా అంటే నాలుగు బూతులు, ఐదు అడల్ట్‌ సీన్స్‌ అన్నట్టుండాలి. బి,సి సెంటర్లలో మారుతికి అలా ఓ బ్రాండ్‌ స్థిరపడిపోయింది. అయితే ఆ బ్రాండిరగును మార్చుకునే ప్రయత్నంలో సినిమాటోగ్రాఫర్‌ ప్రభాకర్‌ని దర్శకుడిని చేసి ‘ప్రేమకథాచిత్రమ్‌’ని తీశాడు. జూన్‌ 7 ఆదివారం రోజు ఈ సినిమా రిలీజవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు