దెబ్బకి సూపర్‌స్టార్‌ దిగొచ్చేసాడు

దెబ్బకి సూపర్‌స్టార్‌ దిగొచ్చేసాడు

భారీ బడ్జెట్‌ చిత్రాలు చేయడం కంటే తమ ఇమేజ్‌తో ఒక రేంజ్‌ సినిమాలని పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లడం బెటర్‌ అని రజనీకాంత్‌ రియలైజ్‌ అయినట్టే వున్నారు. 2.0 చిత్రం కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అవడంతో రజనీకాంత్‌ బడ్జెట్‌ని కంట్రోల్‌లో వుంచే సినిమాలు చేస్తున్నారు. తన ఏజ్‌కి తగ్గట్టుగా, తన స్టయిల్‌కి తగ్గట్టుగా రజనీకాంత్‌ సినిమాలు సెలక్ట్‌ చేసుకుంటున్నారు. పేట చిత్రం అలా చేయడం వల్ల సత్ఫలితాన్ని చూడడంతో తదుపరి చిత్రాన్ని కూడా అలాగే ప్లాన్‌ చేస్తున్నారు.

మురుగదాస్‌తో సినిమా అంటే సోషల్‌ మెసేజ్‌ వున్న సినిమా అని అనుకున్నారు. కానీ దర్బార్‌ ఫస్ట్‌ లుక్‌తో ఇది ఎంటర్‌టైనర్‌ అనేది స్పష్టమయింది. ఇలాంటి చిత్రాలకి బడ్జెట్‌ అయ్యేది వుండదు. రజనీకాంత్‌ రెమ్యూనరేషన్‌ మినహాయిస్తే చాలా తక్కువలో అయిపోతుంది. తీయడానికి ఎక్కువ రోజులు కూడా అవసరం వుండదు. వెటరన్‌ హీరోలు భారీ చిత్రాల జోలికి వెళ్లి పుణ్యకాలం కాస్తా వాటిపై వృధా చేయడం కంటే ఇలా తక్కువ టైమ్‌లో అయిపోయే సినిమాలు చేస్తే ఉత్తమమనిపిస్తోంది. దర్బార్‌ కూడా హిట్టయితే అందరు వెటరన్ల ఆలోచనలు ఇలా మారతాయని అనుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English