విజయ్‌ దేవరకొండ సెట్టింగే సెట్టింగ్‌ అండీ!

విజయ్‌ దేవరకొండ సెట్టింగే సెట్టింగ్‌ అండీ!

ఒక సినిమాపై బజ్‌ ఎలా క్రియేట్‌ చేయాలనే లెసన్స్‌ విజయ్‌ దేవరకొండనుంచి తీసుకోవాలి. ప్రమోషన్స్‌ విషయంలో విజయ్‌ దేవరకొండ బాగా ఇన్‌వాల్వ్‌ అవుతాడు. తన సినిమాలకి వచ్చే ప్రేక్షకులు ఎవరు? వారికి ఏమి చూపిస్తే నచ్చుతుందీ అనేది విజయ్‌కి బాగా తెలుసు. డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్నే తీసుకుంటే టీజర్‌ ముందు వరకు పెద్దగా బజ్‌ లేదు. కానీ టీజర్‌ వచ్చాక సీనే మారిపోయింది. తాజాగా ఈ చిత్రంలోని ఒక పాట విడుదలయి ఫాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. మంచి మెలోడీ పాటని ఎంచుకుని విడుదల చేయడంతో మరోసారి 'ఇంకేం ఇంకేం కావాలే' లాంటి మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందని భావిస్తున్నారు.
 
టీజర్‌ ఎలా వుండాలి, ఏ పాట ముందుగా విడుదల చేయాలి, మొదటి పోస్టర్‌ ఎలాగుండాలి లాంటివన్నీ విజయ్‌ దేవరకొండ డిసైడ్‌ చేస్తుంటాడట. అతని లెక్క తప్పుతుందని యూనిట్‌లో ఎవరు భావించినా కానీ అతను వాదించి మరీ తన మాట నెగ్గించుకుంటాడట. ఇంతవరకు అతని లెక్క తప్పకపోవడం, అతని సినిమాలకి చేసే మార్కెటింగ్‌ ఏదీ మిస్‌ఫైర్‌ కాకపోవడం చూస్తేనే అతనికి పబ్లిక్‌ పల్స్‌ ఎంతబాగా తెలుసనేది అర్థమవుతోంది. దేవరకొండ వారి అబ్బాయా మజాకానా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English