చరణ్‌ కంటే ఎందులోను తగ్గకూడదు!

చరణ్‌ కంటే ఎందులోను తగ్గకూడదు!

అల్లు అర్జున్‌ ఇంతకుముందు చాలా ఫ్రీగా వుండేవాడు కానీ రంగస్థలం తర్వాత ఒత్తిడికి గురవుతున్నాడు. అందుకే 'నా పేరు సూర్య' తర్వాత అతను ఇంతవరకు మరో సినిమా మొదలు పెట్టలేదు. చరణ్‌ ఫామ్‌లోకి వచ్చిన నేపథ్యంలో తాను అల్లాటప్పా సినిమాలు చేస్తే ఫాన్స్‌లో తన ప్రత్యేకత నిలబడదనేది అతని భయం. అంతే కాదు, అంతకుముందు పవన్‌కళ్యాణ్‌ అభిమానులతో వున్న విబేధాలని దూరం చేసుకుని వారిని కలిపేసుకోవడానికి కూడా అల్లు అర్జున్‌ ఇటీవల తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. పవన్‌ ఫాన్స్‌ నుంచి మార్కులు పడే ఏ ఒక్క అవకాశాన్నీ అల్లు అర్జున్‌ వదులుకోవడం లేదు. అందులోను చరణ్‌ చేసాడంటే మాత్రం వెంటనే తాను కూడా అది చేసేసి తనని ఒక మాట అనడానికి లేకుండా చేస్తున్నాడు.

జనసేనకి మద్దతుగా చరణ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసే వరకు అల్లు అర్జున్‌ దాని గురించి మాట్లాడలేదు. పవన్‌కి అస్వస్థతగా వుందని చరణ్‌ వెళ్లి కలవడంతో ఇప్పుడు తాను కూడా పవన్‌ని కలవడానికి వెళుతున్నాడు. చరణ్‌ నేరుగా ప్రచారం చేయకపోవడంతో బన్నీ మాత్రం ఒక రోడ్‌ షోలాంటిది చేసి అభిమానులనుంచి కాసిని ఎక్కువ మార్కులు వేయించుకోవాలని చూస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English