మొత్తానికి నాగార్జున కరువు తీరిపోయింది

మొత్తానికి నాగార్జున కరువు తీరిపోయింది

ఊపిరి. నిర్మలా కాన్వెంట్. ఓం నమో వెంకటేశాయ. రాజు గారి గది 2. ఆఫీసర్. దేవదాసు. ఈ సినిమాలన్నింటికీ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి వాటిలోనాగార్జున అక్కినేని హీరో అయితే, రెండోది అవన్నీ ఫ్లాపులే. అందుకే చాలా కాలం నుండి నాగ్ చాలా అప్సెట్ అయిపోతున్నాడు. అసలు సోగ్గాడే చిన్ని నాయన సినిమా తరువాత హిట్టు పడట్లేదని బాధపడుతున్నాడు.

ఇకపోతే ఈ కరువును అన్నపూర్ణ స్టూడియోస్ (లేకపోతే మనం ఎంటర్ ప్రైజెస్) అయినా తీరుస్తుందని అనుకుంటే.. వాళ్లు తీసిన హలో అండ్ రంగులరాట్నం సినిమాలు కూడా దెబ్బేశాయి. కరక్టుగా ఇదే టైములో పెద్ద కొడుకు నాగచైతన్య చిన్న కొడుకు అఖిల్ కూడా ఫ్లాపులతోనే సతమతం అవుతున్నారు. అందుకే ఇప్పుడు 'మజిలి' సక్సెస్ ను నాగ్ ఓ రేంజులో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. నిన్న ఆదివారం సమంత అండ్ చైతన్యను ఇంటికి పిలిచి డిన్నర్ చేసిన నాగ్, త్వరలోనే ఈ సినిమా యునిట్ కు గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడట. అంటే తన కరువును తీర్చేసిన ఈ సినిమా యునిట్ ను ఎంత గౌరవించినా కూడా తక్కువే అని ఆయన ఫీలయ్యాడట.

ఏదేమైనా కూడా ఒక్క హిట్టు సినిమా పడిందంటే ఆ జోష్‌ వేరేగా ఉంటుంది. మరి నాగ్ కూడా మన్మథుడు 2 సినిమాతో ఒక సోలో హిట్టు కొడితే ఆ లెక్కే మారిపోతుంది. అలాగే అఖిల్ కు కూడా కరువు తీర్చేసే కథ ఒకటి సెట్టయితే బాగుండు!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English