డ్రామా ఆర్టిస్టులా ఉంటావయ్యా సామీ

డ్రామా ఆర్టిస్టులా ఉంటావయ్యా సామీ

'కోబ్రా' సినిమాలో లీడ్ నటుడు ఎవరో కాదు.. మనందరికీ తెలిసిన రామ్ గోపాల్ వర్మ సారే. అయితే సడన్ గా 57 ఏళ్ళు వయసొచ్చాక ఇప్పుడు యాక్టింగ్ మీద మక్కువ వచ్చేందేంటి సారూ అంటూ మాత్రం అంతా 'నా ఇష్టం' అంటాడు. కాకపోతే ఇక్కడే ఒక విషయం మనోడు మిస్సయిపోతున్నాడు. ఆ లాజిక్ తనకు తెలుసుంటే కాని మనోడు నటుడుగా నిలదొక్కుకోలేడు.

వర్మ తీసిన మహా అద్భుతాలు, అలాగే మహా ఫ్లాపుల్లో ఒక తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా గొప్ప కథా కథనం ఉండాలి, రెండోది మంచి నటులు ఉండాలి. యావరేజ్ కథను మహానటులు గొప్ప సినిమాగా మలచగలరు. అలాగే గొప్ప కథను యావరేజ్ నటులు కూడా ఆడేలా చేయగలరు. మొదటి మాటకు ఉదాహరణకు సర్కార్ సినిమా తీసుకోండి, రెండోదానికి ఎగ్జాంపుల్ శివ సినిమాయే అనుకోండి. వాటి మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు వర్మ మళ్ళీ తన డైరక్షన్లో తనే యాక్షన్ అంటే కాస్త కామెడీగా ఉంటుంది.

అంతే కాకుండా వర్మ ఏకంగా ఒక మాఫియా డాన్ కథను చేస్తున్నాడు. ఇన్నాళ్ళూ సదరు డాన్స్ తాలూకు హావభావాలనూ ఆంతర్యాన్ని బాగా అర్దంచేసుకున్న వర్మ, అదే కథతో ఈ మధ్యన ఎన్ని సినిమాలు తీసినా జనాలకు ఎక్కట్లేదు. అలాంటప్పుడు తన శిష్యులు అయిన అనురాగ్ కశ్యప్, పూరి జగన్ వంటి డైరక్టర్ల సినిమాల్లో మనోడు నటిస్తే బాగుండేది కాని, సొంత సినిమాలో తనే విలన్ అంటే మాత్రం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చేసిన డ్రామా ఆర్టిస్టులా అస్సలు కన్విన్సింగ్ గా ఉండడు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English