ఎప్పటి రూమర్.. ఇప్పుడు డిస్కషనేంటి?

ఎప్పటి రూమర్.. ఇప్పుడు డిస్కషనేంటి?

రెజీనా కసాండ్రా.. తెలుగు సినిమాలకు దూరమై చాలా కాలం అయిపోయింది. ఇప్పుడామెను ఇక్కడి ఫిలిం మేకర్స్ ఎవరూ కన్సిడర్ కూడా చేయడం లేదు. ఆమెను మన ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయారు. ఇలాంటి టైంలో తనకు ఓ తెలుగు కథానాయకుడితో ఎఫైర్ ఉందన్న వార్తలు అబద్ధం అంటూ ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం విడ్డూరంగా అనిపిస్తోంది. ఇక్కడ డిస్కషన్లో ఉన్న హీరో సాయిధరమ్ తేజ్ అన్నది బహిరంగ రహస్యం.

అతను, రెజీనా కలిసి రెండు సినిమాల్లో నటించడం.. ఆ రెండు సినిమాల్లో వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజిలో పండటం, సినిమాల వేడుకల్లో, బయట వీళ్లిద్దరూ క్లోజ్‌గా కనిపించడంతో అప్పట్లో వీరి మధ్య ఎఫైర్ ఉందేమో అని గుసగుసలు వినిపించిన మాట వాస్తవం. ఐతే ఆ రూమర్లు నడిచినపుడు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. రెజీనా అసలు హైదరాబాద్ వైపు, తెలుగు సినిమాల వైపు చూడట్లేదు.

రెజీనా అనే హీరోయిన్ ఒకరున్నారు అన్న సంగతే మన జనాలకు పట్టట్లేదు. ఎక్కడా ఆమె గురించి వార్తల్లేవు. అసలు సాయిధరమ్ తేజ్ గురించే అంతగా డిస్కషన్లు ఉండట్లేదు. అందరి ఫోకస్ అతడి ఫ్లాపుల మీద ఉందే తప్ప.. తన ఎఫైర్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అసలు తేజుకు అలాంటి ఇమేజే లేదు. ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తేజు కల్పించుకుని ఓ హీరోయిన్‌తో తనకు ఎఫైర్ అంటూ వచ్చిన వార్తల్ని ఖండించాడు.

తను నాకు ఫ్రెండ్ మాత్రమే అని.. ఎఫైర్ రూమర్ల వల్ల ఆమె కెరీర్ దెబ్బ తింటుందనే ఉద్దేశంతో తనతో ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసుకున్నానని చెప్పాడు. ఆ హీరోయిన్ రెజీనా అని అందరికీ తెలుసు. ఐతే ఇప్పుడు తేజు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాడా అని జనాలు ఆశ్చర్యపోతుంటే.. అంత కంటే ఆశ్చర్యకరంగా తనకు ఓ తెలుగు హీరోతో ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తల్ని ఖండిస్తూ రెజీనా చెన్నై నుంచి స్టేట్మెంట్ ఇచ్చింది. అసలిప్పుడు వీళ్ల ఎఫైర్ గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారని.. ఒకరి తర్వాత ఒకరు స్టేట్మెంట్స్ ఇచ్చారన్నదే అర్థం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English