నాలుగే నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్

నాలుగే నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్

సరైన టైమింగ్ కుదిరితే కొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగిపోతుంటాయి. ‘గీత గోవిందం’ అనే సినిమా రూ.70 కోట్ల షేర్ సాధిస్తుందని ఎవరైనా అనుకున్నారా? అలాగే ‘ఎఫ్-2’ చిత్రం రూ.80 కోట్ల షేర్ క్లబ్బులో చేరడమూ అనూహ్యమే. ఈ సినిమాలకు ముందు నుంచి పాజిటవ్ బజ్ ఉంది కానీ.. అవి మరీ ఆ స్థాయిలో ఆడేస్తాయని ఎవ్వరూ అనుకోలేదు. వాటికి రిలీజ్ టైమింగ్, టాక్ అంత బాగా కలిసొచ్చాయి.

ఇప్పుడు ‘మజిలీ’ సినిమాకు కూడా బాక్పాఫీస్ దగ్గర ఇలాగే కలిసొస్తున్నట్లుగా ఉంది. రెండు నెలలకు పైగా సరైన సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సమయంలో ‘మజిలీ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వేసవి సెలవుల్లో వచ్చిన చెప్పుకోదగ్గ తొలి సినిమా ఇదే. ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఆవురావురుమని ఉన్న సమయంలో ఇది రిలీజైంది. దీనికి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేస్తున్నారు.

అక్కినేని నాగచైతన్య గత సినిమాల రికార్డులన్నీ ‘మజిలీ’ బద్దలు కొట్టేస్తోంది. తొలి రోజు రూ.7 కోట్లకు పైగా షేర్ సాధించి.. చైతూ కెరీర్లో హైయెస్ట్ డే-1 గ్రాసర్‌గా నిలిచిందీ చిత్రం. వీకెండ్ అయ్యేసరికి ‘మజిలీ’ రూ.17.5 కోట్ల దాకా షేర్‌ రాబట్టడం విశేషం. తొలి వారాంతంలో చైతూకిదే అత్యధిక వసూళ్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి రోజుకు దీటుగా తర్వాతి రెండు రోజుల్లోనూ వసూళ్లు వచ్చాయి. ఎక్కడా డ్రాప్ అన్నది లేదు.

సోమవారం సైతం ‘మజిలీ’కి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈజీగా రూ.3 కోట్లకు పైగా షేర్ వర్కవుట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రానికి రూ.21 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే నాలుగో రోజుకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుంటోందన్నమాట. మంగళవారం నుంచి వచ్చే వసూళ్లు లాభాలే. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ రూ.25 కోట్ల షేర్‌తో చైతూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ‘మజిలీ’ దాన్ని దాటడమే కాదు.. రూ.30 కోట్ల షేర్ క్లబ్బులో చేరడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English