చరణ్‌ సై అన్నా... పవన్‌ నో అన్నాడు!

చరణ్‌ సై అన్నా... పవన్‌ నో అన్నాడు!

బాబాయ్‌కి అండగా వుంటానంటూ చెప్పి జనసేన ప్రచారానికి మొహం చాటేసాడని చరణ్‌పై ఫాన్స్‌ గుస్సా అవుతున్నారు. పవన్‌ ఒంటరి పోరాటం చేస్తోంటే కనీసం కుటుంబం కూడా అండగా నిలబడదేమిటి అంటూ చరణ్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో కామెంట్లతో విరుచుకు పడుతున్నారు. దాంతో మౌనం వీడి జనసేనకి మద్దతు తెలిపిన చరణ్‌ అంతటితో ఆగకుండా పవన్‌కి బాలేదని తెలిసి తన కాలు ఫ్రాక్చర్‌ అయి వున్నా విజయవాడ స్వయంగా వెళ్లాడు.

జనసేన ఆఫీస్‌లో చరణ్‌ ఫోటోలు చూసి ఫాన్స్‌ ఖుష్‌ అయిపోయారు. బాబాయ్‌ తరఫున చరణ్‌ ప్రచారం కూడా చేస్తాడని భావించారు. నిజానికి చరణ్‌ కూడా అందుకు సిద్ధపడే వెళ్లాడట. తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని పవన్‌తో చరణ్‌ చెప్పాడట. కానీ ఇప్పుడు రాజకీయాలు వద్దంటూ పవన్‌ వారించాడట. రాజకీయాల్లోకి వస్తే సినిమా కెరియర్‌పై ప్రభావం పడుతుందని, తనపై ఒక పార్టీకి చెందిన వాడనే ముద్ర పడుతుందని, అభిమానులు అన్ని పార్టీల్లోను వుంటారు కనుక వారి మనోభావాలు దెబ్బ తీయవద్దని పవన్‌ వారించాడట. కానీ చివరి రెండు రోజుల్లో చరణ్‌ ఒక్కసారయినా పబ్లిక్‌ని అడ్రస్‌ చేస్తే బాగుంటుందని ఫాన్స్‌ ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English