డైరెక్టర్స్‌ని వేపుకు తింటోన్న నితిన్‌!

డైరెక్టర్స్‌ని వేపుకు తింటోన్న నితిన్‌!

ఫ్లాప్స్‌లో వున్నపుడు ఎలా వుంటుందో నితిన్‌ కంటే బెటర్‌గా ఎవరూ చెప్పలేరు. ఎనిమిది సంవత్సరాలకి పైగా ఒక్క హిట్‌ లేకుండా దాదాపు తెరమరుగయ్యే పరిస్థితినుంచి కోలుకుని మంచి హిట్‌ సినిమాలిచ్చాడు. కానీ 'అ ఆ'తో కెరియర్‌ బెస్ట్‌ హిట్‌ కొట్టిన తర్వాత నితిన్‌ని అదృష్ట లక్ష్మి విడిచిపోయింది. వరుసగా మూడు భారీ పరాజయాలతో డీలా పడిన నితిన్‌కి ఇప్పుడు ధైర్యం చాలడం లేదు. కథ నచ్చి ఓకే చేసినా కానీ వాటికి ఏవో వంకలు చెబుతూ షూటింగ్‌ మొదలు పెట్టడం లేదు. శ్రీనివాస కళ్యాణం ఆగస్టులో రిలీజ్‌ అయితే ఆ తర్వాత నితిన్‌ సినిమా ఏదీ మొదలు కాలేదు.

ఛలో దర్శకుడు వెంకీ కుడుముల కథని ఓకే చేసి ఆరు నెలలు దాటుతోన్నా ఇంకా మొదలు పెట్టలేదు. భీష్మతో పాటు చంద్రశేఖర్‌ ఏలేటి సినిమా అనౌన్స్‌ చేసిన నితిన్‌ ఏదో ఒక డౌట్‌ రైజ్‌ చేస్తూ సదరు దర్శకులని వేపుకు తింటున్నాడని చెప్పుకుంటున్నారు. ఈసారి వచ్చే సినిమా ఫ్లాప్‌ అయితే తన పరిస్థితి దారుణంగా వుంటుందనే భయంతో నితిన్‌ అస్సలు ధైర్యం చేయలేకపోతున్నాడు. కానీ ఫెయిల్యూర్‌ భయంతో ఇలా బిగుసుకుపోతే మొదటికే ప్రమాదం వస్తుంది కదా అని శ్రేయోభిలాషులు నచ్చచెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English