ఇంత భయమయితే ఎలాగయ్యా మెగా హీరో?

ఇంత భయమయితే ఎలాగయ్యా మెగా హీరో?

వరుణ్‌ తేజ్‌ సరాసరి ఎన్నికల ప్రచారానికే వచ్చేసాడు. అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ ఇద్దరూ ఆన్‌లైన్‌లో పవన్‌కళ్యాణ్‌కి మద్దతు పలికారు. అతని విజయాన్ని కాంక్షించారు. కానీ సాయి ధరమ్‌ తేజ్‌ మాత్రం రాజకీయాలకి దూరంగా వుంటున్నాడు. వరుసగా ఆరు ఫ్లాపులు రావడంతో 'చిత్రలహరి'తో గట్టున పడాలని చూస్తున్నాడు. ఈ సినిమా ప్రచార సమయానికి ఎన్నికల వేడి పీక్స్‌లో వుంది. దీంతో 'చిత్రలహరి' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చిన అభిమానులు 'జై జనసేన' అనిపించాలని, అతనితో పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల గురించి నాలుగు ముక్కలు మాట్లాడించాలని చూసారు. కానీ తన సపోర్ట్‌ మనసులో వుంటుందని, అది బయటకి చెప్పాల్సిన పని లేదని అనేసి సాయి ధరమ్‌ తేజ్‌ తప్పించుకున్నాడు.

ఎక్కడ పవన్‌కి జై కొడితే తన సినిమాని మిగిలిన పార్టీల అభిమానులు నిషేధిస్తారోననే భయం సాయి ధరమ్‌ తేజ్‌లో బాగా కనిపించింది. తన మేనమామ గెలుపు కోరుకుంటే దానిని మిగతా వాళ్లు తప్పుబట్టే అవకాశం లేదు. అయినా కానీ ఎందుకొచ్చిన గొడవ అన్నట్టు సాయి ధరమ్‌ తేజ్‌ ఆ ప్రస్తావన లేకుండానే స్పీచ్‌ ముగించేసాడు. దీని వల్ల మిగతా పార్టీల వారి సపోర్ట్‌ తనకి వుంటుందో లేదో తెలియదు కానీ జనసేన, పవన్‌ సేన అయితే తేజ్‌ని ఓన్‌ చేసుకోలేరిపుడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English