తేజ్‌ని ఇబ్బందుల్లో పెట్టిన మహేష్‌!

తేజ్‌ని ఇబ్బందుల్లో పెట్టిన మహేష్‌!

'చిత్రలహరి' చిత్రంపై సాయి ధరమ్‌ తేజ్‌ చాలా ఆశలే పెట్టుకున్నాడు. పేరు విజయ్‌ అయినా జీవితంలో విజయం లేని క్యారెక్టర్‌ అతను పోషిస్తున్నాడు. ఈ చిత్రం ట్రెయిలర్‌లో అంతా సక్సెస్‌ లేని విజయ్‌ ప్రస్తావనే వుంది. ఈ ట్రెయిలర్‌ బాగున్నా కానీ దీనికంటే ఒక రోజు ముందు విడుదల చేసిన మహర్షి టీజర్‌ ఈ చిత్ర బృందాన్ని ఒక విధమైన ఇబ్బందికి గురి చేసింది. మహర్షి టీజర్‌లో కూడా సక్సెస్‌ ప్రస్తావనే ఎక్కువగా వుంటుంది. చాలా సక్సెస్‌ అయిన హీరో తన సక్సెస్‌తో సంతృప్తి పడకుండా ఇంకా ఇంకా సక్సెస్‌ కావాలని కోరుకుంటూ వుంటాడు... అది మహర్షి కాన్సెప్ట్‌.

కానీ చిత్రలహరి హీరోది సరిగ్గా అందుకు ఆపోజిట్‌. జీవితంలో దేంట్లోను సక్సెస్‌ కాలేక... నాలుగు వైపులా సూర్యుడు ఉదయించినా కానీ తన జీవితంలో చీకటే తప్ప వెలుగు వుండదని బాధ పడుతుంటాడు. రెండు సినిమాల్లో కాన్సెప్ట్‌ వేరు, హీరోల పాత్రచిత్రణ వేరు అయినా కానీ సక్సెస్‌ ప్రస్తావన ఎక్కువగా వుండడంతో రెండిట్లో మహర్షికి ఆబ్వియస్‌గా ఎక్కువ అటెన్షన్‌ వుండడంతో తమ ట్రెయిలర్‌ని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విడుదల చేయకుండా ఒక రోజు ఆలస్యంగా విడుదల చేసిందట. ట్రెయిలర్‌ శనివారం రాత్రికే విడుదల కావాల్సి వుండగా, టెక్నికల్‌ రీజన్స్‌ అని చెప్పి మర్నాడు రిలీజ్‌ చేసారు. ఇది మహర్షి టీజర్‌ వల్ల వచ్చిన ఇబ్బందేనని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English