నాకు అంత తెలుగు రాదండీ బాబూ..

నాకు అంత తెలుగు రాదండీ బాబూ..

ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడం అవసరాల శ్రీనివాస్‌కు ఎప్పుడూ అలవాటే. తొలి సినిమా ‘అష్టాచెమ్మా’లోనే ఏమాత్రం తడబాటు లేకుండా అనుభవం ఉన్నవాడిలా నటించి ఆశ్చర్యపరిచాడు. ఆపై దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ‘ఊహల గుసగుసలాడే’ లాంటి అందమైన, ఆహ్లాదకరమైన చిత్రం తీసి మరోసారి ఆశ్చర్యపరిచాడు. అతడి దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ‘జ్యో అచ్యుతానంద’ కూడా మంచి విజయం సాధించింది. అతడి ప్రత్యేకతను చాటింది.

ఈ సినిమాల్లో అతడి మాటల చాతుర్యం అందరినీ ఆకట్టుకుంది. అవసరాలను నవతరం జంధ్యాల అంటూ పొగిడేశారు జనాలు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే మాట అవసరాల దగ్గర ప్రస్తావిస్తే అతను.. ఆ మాట సరి కాదన్నాడు. తనకు తెలుగులో అందరూ అనుకున్నంత పరిజ్ఞానం లేదని అవసరాల చెప్పాడు.

తనకు తెలుగు బాగా వచ్చని జనాలు అనుకుంటుంటారని.. కానీ అది నిజం కాదని అవసరాల చెప్పాడు. నిజానికి నా తెలుగులో చాలా తప్పులు కూడా దొర్లుతుంటాయని.. వాళ్లూ వీళ్లూ చెబుతుంటే వాటిని సరిదిద్దుకుంటూ ఉంటానని అవసరాల చెప్పాడు. జంధ్యాల లాంటి మహానుభావుడితో పోల్చడం సంతోషంగా అనిపించినా.. ఆ పొగడ్తను తాను స్వీకరించలేనని అవసరాల స్పష్టం చేశాడు.

ఇక తన దర్శకత్వం గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను దర్శకుడిని అవుతానంటే చాలామంది నమ్మలేదన్నారు. నువ్వింత సాఫ్ట్‌గా ఉంటావు.. దర్శకత్వం చేయగలవా అంటూ సందేహాలు వ్యక్తం చేశారని.. అలా అన్న వాళ్లందరితోనూ వెంటనే సంతకం చేయించుకుని డేట్ వేసుకున్నానని అవసరాల చెప్పాడు. దర్శకుడిగా మారాలన్న లక్ష్యంతోనే సినీ రంగంలోకి వచ్చినట్లు చెప్పిన అవసరాల.. పట్టుబట్టి తాను అనుకున్నది సాధించానని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English