బాక్సాఫీస్ గ్రహణం వీడింది

బాక్సాఫీస్ గ్రహణం వీడింది

2019పై ఎన్నో ఆశలు పెట్టుకుంది టాలీవుడ్. సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగిపోతుందని ఆశించింది. కానీ ‘ఎఫ్-2’ మినహాయిస్తే ఏ సినిమా కూడా సత్తా చాటలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘ఎన్టీఆర్: కథానాయకుడు’.. ‘వినయ విధేయ రామ’ సినిమాలకు దక్కిన ఫలితం షాకింగే. ఇక ‘ఎఫ్-2’ జోరు ముగిశాక గత రెండు నెలల్లో బాక్సాఫీస్ ఎలా వెలవెలబోయిందో తెలిసిందే. గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడని స్లంప్ ఇది. సమ్మర్ దగ్గర పడుతున్నా కూడా కొత్త సినిమాల ఊపు కనిపించకపోవడంతో.. టాలీవుడ్ జనాల్లో ఆందోళన నెలకొంది.
 
ఐతే ఎట్టకేలకు ‘మజిలీ’ సినిమాతో పరిస్థితి మారింది. టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పట్టిన గ్రహణం ఈ సినిమాతో వీడిపోయిందనే చెప్పాలి. గత రెండు నెలల్లో కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా వసూళ్లు రాని పరిస్థితి నెలకొంది. ‘మజిలీ’ సినిమాకు టాక్ బాగుంది. వసూళ్లూ బాగున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశంలో ‘మజిలీ’ విడుదలైన అన్ని చోట్లా ఆదరణ అద్భుతంగా ఉంది. బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ‘మజిలీ’ హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. యుఎస్‌లో సైతం ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రిమియర్లతో కలిపి శుక్రవారానికే 3 లక్షల డాలర్ల మార్కును అందుకున్న ఈ చిత్రం శనివారమే హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్బులో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తొలి రోజుకు దీటుగా రెండో రోజు వసూళ్లు ఉన్నాయి. ఎక్కడా డ్రాప్ అన్నది లేదు. రెండో రోజు కూడా హౌస్ ఫుల్స్‌తో నడిచిందీ చిత్రం. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రెండు థియేటర్లలోనూ మార్నింగ్ షోస్ మినహా అన్ని షోలకూ హౌస్ ఫుల్స్ పడ్డాయి శనివారం. మిగతా చోట్ల కూడా ప్యాక్డ్ థియేటర్లతో నడుస్తోంది ‘మజిలీ’. నాగచైతన్య కెరీర్లో ఇది హైయెస్ట్ గ్రాసర్ కావడం లాంఛనమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English