నాగార్జున కంటే సమంత సూపర్‌!

నాగార్జున కంటే సమంత సూపర్‌!

అఖిల్‌కి ఎలాగైనా హిట్‌ ఇవ్వాలని నాగార్జున చాలా ప్రయత్నించినా కానీ ఇంతవరకు ఆయన కోరిక నెరవేరలేదు. నాగార్జునలానే చైతన్యకి పెద్ద హిట్‌ ఇవ్వాలని సమంత కూడా ప్లాన్‌ చేసుకుంటూ వస్తోంది. వరుసగా మూడు ఫ్లాప్‌లు వచ్చి చైతన్య మార్కెట్‌ బాగా పడిపోయిన దశలో సమంత అతనితో 'మజిలీ' ఓకే చేయించింది. ఈ చిత్రంలో శ్రావణి పాత్ర సమంత చేసి తీరాలని దర్శకుడు శివ నిర్వాణ కోరుకున్నాడు. తను ముందే ఓకే చేసిన చిత్రాలతో క్లాష్‌లు వచ్చినా కానీ ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్‌ వల్ల చైతన్యకి చాలా పేరు వస్తుందని సమంత గ్రహించింది. ఇది చైతన్య ఎట్టి పరిస్థితుల్లోను మిస్‌ అవకూడదని అతను ఒప్పుకున్న వేరే సినిమాలు కూడా వాయిదా వేయించింది.

సమంత గట్‌ ఫీలింగ్‌ని చూసే చైతన్య ఈ చిత్రంపై నమ్మకం పెట్టుకున్నాడట. ఈ చిత్రం రూపకల్పనలో ప్రతి దశలోను సమంత చాలా ఇన్‌వాల్వ్‌ అయిందట. ఈ చిత్రానికి తమ కాంబినేషన్‌ పెద్ద ప్లస్‌ అవుతుందని సమంత నమ్మకంగా చెప్పేదట. అలా ఈ విజయాన్ని సమంత స్క్రిప్ట్‌ చేసిందట. ఎంతో మంది నిర్మాతల వల్ల కూడా పని సమంత సాధించిందని, చైతన్యకి పెద్ద హిట్‌ ఇవ్వగలిగిందని ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. మజిలీ చిత్రానికి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో అక్కినేని ఫ్యామిలీ పెద్ద పార్టీనే చేసుకుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English