మెగా హీరోలని వేధిస్తోన్న ఫాన్స్‌

మెగా హీరోలని వేధిస్తోన్న ఫాన్స్‌

పవన్‌కళ్యాణ్‌కి తన కుటుంబంలోని హీరోల సపోర్ట్‌ అక్కర్లేదు. రాజకీయంగా ఒక పార్టీకి మద్దతు ఇస్తే అది కెరియర్‌పై ఎఫెక్ట్‌ చూపిస్తుందనేది పవన్‌కి తెలుసు. అందుకే మెగా హీరోలు ఎవరినీ అతను ప్రచారానికి రమ్మని ఆహ్వానించలేదు. కానీ ఒంటరి పోరాటం చేస్తూ, రాష్ట్రమంతా ఒక్కడే అయి తిరుగుతోన్న పవన్‌ని చూసి ఫాన్స్‌ మాత్రం మిగతా మెగా హీరోలపై మండి పడుతున్నారు. కనీసం చివరి వారంలో అయినా మెగా హీరోలు బరిలోకి రావాలని, పవన్‌ అలసిపోయి ప్రచారం చేయలేనంత నీరసంగా అయిపోయిన దశలో అయినా అతనికి కుటుంబం అండ నిలబడాలని ఫాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా మిగతా మెగా హీరోలపై ఒత్తిడి తెస్తున్నారు.

ఈ ఒత్తిడిని తాళలేకే చరణ్‌, అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియా ద్వారా పవన్‌కి మద్దతు తెలిపారు. కానీ స్వయంగా రంగంలోకి దిగి కనీసం పవన్‌ పోటీ చేస్తోన్న స్థానాల్లో అయినా ప్రచారం చేయాలని ఫాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఒత్తిడికి తలొగ్గి చరణ్‌ ఒక రోజు ప్రచారానికి వస్తున్నాడనే ప్రచారం ఆల్రెడీ మొదలు పెట్టారు. వరుణ్‌ తేజ్‌ తన తండ్రి కోసం ప్రచారం చేయడంతో మిగతా మెగా హీరోలకి అతనికి వున్న పాటి ధైర్యం లేదా అని ఫాన్స్‌ నిలదీస్తూ వుండడంతో ప్రస్తుతం చరణ్‌, అల్లు అర్జున్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మరి ఫాన్స్‌ డిమాండ్లకి తలొగ్గి నిజంగా ప్రచారం చేస్తారా లేక మరో నాలుగు రోజులు కళ్లు మూసుకుంటే ఇది పాస్‌ అయిపోతుందని వేచి చూస్తారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English