ఆ సినిమా నుంచి కోన వెంకట్ ఔట్

ఆ సినిమా నుంచి కోన వెంకట్ ఔట్

టాలీవుడ్లో చాలామంది దర్శకులకు లైఫ్ ఇచ్చిన రచయితగా కోన వెంకట్‌కు పేరుంది. మీడియం రేంజ్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీను వైట్ల స్టార్ దర్శకుడిగా ఎదగడంలో కోన పాత్ర ఉందన్నది స్పష్టం. అతడితో పాటు మరెందరో దర్శకులకు సూపర్ హిట్ స్క్రిప్టులిచ్చి వాళ్లు మంచి స్థాయికి ఎదగడానికి దోహదపడ్డాడు కోన. కానీ ఎలాంటి రచయితకైనా ఒక దశ తర్వాత కాలం కలిసి రాదు. కోన కూడా అంతే.

గత నాలుగైదేళ్లుగా కోన పరిస్థితి దయనీయంగా ఉంది. ఆయన రచనతో వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఒక్కొక్కరుగా దర్శకులు అతడికి కటీఫ్ చెప్పేస్తున్నారు. శ్రీను వైట్ల సహా చాలామంది దర్శకులకు అతను దూరమయ్యాడు. చివరికి కోన తన ప్రియ శిష్యుల్లో ఒకడిగా చెప్పుకునే కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ కూడా ఆయన్ని విడిచిపెట్టేశాడు.

'పవర్" సినిమాతో బాబీ దర్శకుడిగా పరిచయం కావడంతో కోన పాత్ర కీలకం. ఆ తర్వాత అతను తీసిన 'జై లవకుశ"కు కూడా కోన రచనా సహకారం అందించాడు. బాబీ కొత్త సినిమా 'వెంకీ మామ"కు కూడా ముందు కోననే రైటర్‌గా అనుకున్నాడు. ఇద్దరి మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. వీళ్లిద్దరూ విడిపోయారు. 'వెంకీ మామ "నుంచి కోన వైదొలిగాడు. బాబీ సురేష్ ప్రొడక్షన్స్‌కు చెందిన వేరే రచయితల బృందంతో కలిసి స్క్రిప్టు పూర్తి చేశాడు. తాజాగా రిలీజ్ చేసిన 'వెంకీ మామ" టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్లలో ఎక్కడా కోన వెంకట్ పేరు కనిపించలేదు.

మామూలుగా బాబీ సినిమాల పోస్టర్లపై కోన పేరు ప్రముఖంగా పడుతుంది. కానీ ఈ సినిమా పోస్టర్ మీద మాత్రం చిన్నగా కూడా కోన పేరు లేదు. కాబట్టి ఈ సినిమాలో కోన భాగస్వామి కాదనే భావించాలి. మరి ముందు కోనను రచయితగా అనుకుని.. తర్వాత ఆయనను బాబీ ఎందుకు పక్కన పెట్టాడో? అతనే కోనకు హ్యాండిచ్చాడా.. లేక కోననే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English