ఎఫ్-2ను కొట్టేసిన మజిలీ

ఎఫ్-2ను కొట్టేసిన మజిలీ

మాస్ ఇమేజ్ లేకపోవడం వల్ల అక్కినేని నాగచైతన్య ఓపెనింగ్స్ విషయంలో ఎప్పడూ వెనుకే ఉంటున్నాడు. అతడి సినిమాలకు ఓ మోస్తరు స్థాయిలోనే ఆరంభ వసూళ్లు వస్తుంటాయి. రికార్డుల గురించి మాట్లాడే పరిస్థితే ఉండదు. నాగచైతన్య గత సినిమాల వసూళ్లు అతడికి టార్గెట్‌గా నిలుస్తుంటాయి కానీ.. వేరే హీరోలతో పోటీ పడే పరిస్థితి ఉండదు. ఐతే ఈ మధ్య చైతూ మార్కెట్ కొంచెం పెరిగింది. అతడి సినిమాలకు మంచి ఓపెనింగ్సే వస్తున్నాయి.

గత ఏడాది వినాయక చవితికి వచ్చిన అతడి సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ నెగెటివ్ టాక్ తెచ్చుకుని కూడా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పుడు ‘మజిలీ’ అంతకుమించిన వసూళ్లతో అదరగొడుతోంది. తొలి రోజు హౌస్ ఫుల్స్‌తో రన్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.7 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.5.22 కోట్ల షేర్ వసూలు చేసిన ‘మజిలీ’.. మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.2 కోట్ల దాకా షేర్ కొల్లగొొట్టింది. ఇది నాగచైతన్య కెరీర్లో హైయెస్ట్ డే-1 షేర్ సాధించిన చిత్రం. ‘శైలజారెడ్డి అల్లుడు’ వసూళ్లను అన్ని ఏరియాల్లోనూ దాటేసింది. నైజాం ఏరియాలో ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘ఎఫ్-2’ తొలి రోజు వసూళ్లను దాటేయడం విశేషం.

ఎఫ్-2కు తొలి రోజు నైజాంలో రూ.1.8 కోట్ల షేర్ రాగా.. ‘మజిలీ’ అంతకన్నా ఎక్కువగా రూ.1.94 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మొత్తంగా ఫస్ట్ డే ఎఫ్-2 రూ.8 కోట్ల షేర్ రాబట్టింది. చైతూ స్థాయికి తొలి రోజు రూ.7 కోట్లకు పైగా షేర్ అంటే విశేషమే. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ రూ.21 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తొలి రోజు ఊపు చూస్తే వారం తిరక్కుండానే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్లోనే ‘మజిలీ’ రూ.15 కోట్లకు తక్కువ కాకుండా షేర్ రాబట్టే అవకాశముంది. అమెరికాలో ఈ చిత్రం ప్రిమియర్లతో కలిపి శుక్రవారం నాటికి 3 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్లో మిలియన్ డాలర్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English