సమంతది మామూలు క్రేజ్ కాదబ్బా..

సమంతది మామూలు క్రేజ్ కాదబ్బా..

సమంతను లేడీ సూపర్ స్టార్ అని ఊరికే అనరు. ఆమెకున్న క్రేజే వేరు. సినిమాల్లో తన పాత్రలతోనే కాదు.. తనకే సొంతమైన ప్రత్యేక వ్యక్తిత్వంతోనూ ఆమె భారీగా అభిమానుల్ని సంపాదించుకుంది. ట్విట్టర్లో ఆమెకు ఏకంగా 73 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు. హీరోల కోసం ఎలా సినిమాలు చూస్తారో.. సమంత కోసం అలాగే లక్షల మంది థియేటర్లకు వెళ్లి తన సినిమాలు చూస్తారు. థియేటర్లలో సమంత కనిపించే తొలి సన్నివేశానికి వచ్చే రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మామూలుగా స్టార్ హీరోల్ని చూసినపుడు ఎలా అయితే ప్రేక్షకులు గోల చేస్తారో.. సమంతకు సైతం అలాంటి రెస్పాన్సే కనిపిస్తుంది థియేటర్లలో.

ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. సామ్ కొత్త సినిమా ‘మజిలీ’ శుక్రవారమే రిలీజైంది. ఇందులో సామ్ భర్త నాగచైనత్య హీరో. అతడి తొలి సీన్‌తో పోలిస్తే ఇంటర్వెల్ ముంగిట సమంత అరంగేట్రం చేసే సన్నివేశానికే థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. చైతూకు ఎప్పుడూ మాస్‌లో అంత ఫాలోయింగ్ లేదు. అతడికి మ్యాడ్ ఫ్యాన్స్ తక్కువే. కానీ సమంత రేంజ్ వేరు. ఆమెను వెర్రిగా అభిమానించే అభిమానులున్నారు. ఆమెను తెరపై చూసి ఒక హీరోను చూసిన ఫీలింగ్‌తో ప్రేక్షకులు అరవడం విశేషమే. ‘మజిలీ’ థియేటర్లన్నింట్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐతే ఈ విషయంలో చైతూ ఏమీ ఫీలయ్యే రకం కాదు. సమంత తనకంటే పెద్ద స్టార్ అని అతనెప్పడూ అంగీకరిస్తూనే ఉంటాడు. ఆమెను సూపర్ స్టార్ అని కూడా ఒక సందర్భంలో అతను అభివర్ణించాడు. ఇలా ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్న ఒక హీరో కంటే.. మామూలు నేపథ్యం నుంచి వచ్చిన అతడి భార్యకు క్రేజ్ ఎక్కువుండటం అరుదైన విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English