ఈ హీరోలిద్దరూ అయిపోయినట్టేనా...

ఈ హీరోలిద్దరూ అయిపోయినట్టేనా...

ఎవరికైనా ప్రైమ్‌ టైమ్‌ ఒకటి ఉంటుంది. అది దాటిపోయిందంటే ఖచ్చితంగా ఏం చేసినా జనాలు చూడరు. అసలు అలా దాటుతున్న సమయంలో మనోళ్ళు తమని తాము క్రొత్తగా చూపించుకొనే ప్రయత్నం చేయకపోవడమే, వీరి పతనానికి దారి తీస్తోంది. ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఇద్దరి గురించి చర్చించుకుంటున్నారు. చాలాకాలం హీరోలుగా వెలిగిన వేణు, తరుణ్‌ల కెరియర్‌ దాదాపు ముగిసినట్టేటనని అంటున్నారు.

ప్రస్తుతం తరుణ్‌ నటించిన చుక్కలాంటి అమ్మాయి.. సినిమా రిలీజై ఫ్లాపునే చవిచూసింది. ఇక అదే విధంగా ఏళ్ళ తరబడి ల్యాబ్‌లో మగ్గిన వేణు ‘రామాచారి’ కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టేసింది. ఇక వీళ్ళిద్దరి దగ్గరనుండి త్వరలో వచ్చే  సినిమాలు ఏమీ లేవు. ఆ లెక్కన చూస్తే వేణు, తరుణ్‌ల సీన్‌ అయిపోయినట్టేనని అనిపిస్తోంది. మరి తరుణ్‌కు కనీసం క్రికెట్‌ ఆటైనా ఉంది ఏదైనా చెయ్యడానికి, కాని వేణు ఏం చేస్తాడో తెలియడంలేదు. చూద్దాం..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు