సమంత వద్దు బాబోయ్‌!

సమంత వద్దు బాబోయ్‌!

మామూలుగా ప్రొఫెషనల్‌ అయిన సమంతపై ఇంతవరకు ఎలాంటి కంప్లయింట్‌ లేదు. అయితే భర్తతో కలిసి నటిస్తోన్న సినిమా అనో, లేక భర్తకి ప్రస్తుతం విజయాలు లేవనే కారణంగానో మజిలీ చిత్రం విషయంలో సమంత అవసరానికి మించి ఇన్‌వాల్వ్‌ అయిందట. ఆమె ఇంటర్‌ఫియరిన్స్‌ మరీ తీవ్రంగా వుండడంతో పలుమార్లు మేకర్స్‌ ఇబ్బంది పడ్డారట. ఇందులో మరో కథానాయిక వున్నప్పటికీ ఆమెని అసలు హైలైట్‌ కానివ్వకుండా సమంత తన స్టార్‌డమ్‌తో ఆమెని తొక్కేసిందట. తనకి అసలు కనీస ఫోకస్‌ ఇవ్వడం లేదని దివ్యాన్షా కౌశిక్‌ ఎంత బాధ పడినా కానీ అక్కినేని వారి కోడలికి, హీరోగారి భార్యకి, అగ్ర కథానాయికకి నిర్మాతలు ఎదురు చెప్పలేకపోయారట.

తన పనేదో తాను చేసుకునే సమంత మజిలీకి మాత్రం క్రియేటివ్‌ విషయాలలోను జోక్యం చేసుకుందని, తన భర్త లుక్‌ దగ్గర్నుంచి, స్టయిలింగ్‌ వరకు తనకి కావాల్సినట్టు చేయించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంతకి తన ధ్యాసే ఎక్కువ వుంటుందని చైతన్య కూడా అంగీకరించాడు. ఇంత ఓవర్‌ పొసెసివ్‌ నేచర్‌ వున్న సమంత ఇకపై చైతన్య సినిమాల్లో నటించకపోవచ్చునని అంటున్నారు. మజిలీ గురించి కథలు కథలుగా విన్న తర్వాత ఈ భార్యాభర్తలని ఒకే సినిమాలో ఎవరూ కాస్ట్‌ చేయకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English