నాగార్జున సింగిల్‌ కట్‌ చెప్పలేదట

నాగార్జున సింగిల్‌ కట్‌ చెప్పలేదట

నాగ చైతన్య సినిమాలు పూర్తయిన తర్వాత ఫైనల్‌ కట్‌ ఖరారు చేసే ముందుగా కాపీని నాగార్జునకి చూపిస్తుంటారు. తనకున్న అనుభవంతో ఏది వుంచాలో, ఏది తీసేయాలో నాగార్జున చెబుతుంటారు. అలాగే మజిలీ చిత్రాన్ని కూడా నాగార్జునకి చూపించారట. ఈ చిత్రం ఫైనల్‌ కట్‌ చూసిన నాగార్జున సింగిల్‌ కట్‌ కూడా చెప్పకుండా సూపర్‌గా వుందంటూ దర్శకుడు శివ నిర్వాణని అభినందించారట. చైతన్య చాలా కొత్తగా కనిపిస్తున్నాడని, తన కోడలు సమంతకి ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుందని ప్రశంసించారట. నాగార్జున ఆమోద ముద్ర వేయడంతో మజిలీ బృందానికి విజయంపై మరింత నమ్మకం పెరిగింది.

నాగార్జున ఒక సినిమా చూసి జడ్జి చేస్తే తొంభై శాతం రిజల్ట్‌ ఆయన చెప్పినదానికి అనుగుణంగానే వుంటుందని ఇండస్ట్రీలో అంటూ వుంటారు. సినిమా చేస్తుండగా లేదా ఫైనల్‌ కాపీ చూసాక నాగార్జున బ్యాడ్‌గా వుందన్న సినిమాల్లో చాలా వరకు ఫెయిలయ్యాయి. అలాగే ఆయన బాగుందన్న సినిమాల్లో మిస్‌ఫైర్‌ అయినవి కూడా బహు తక్కువే అనాలి. ఈమధ్య కాలంలో నాగచైతన్య సినిమాలలో నాగార్జున ఇంతగా ప్రశంసలు అందించినదీ, అసలు కట్స్‌ లేకుండా ఓకే చేసినదీ ఇదేనట. ఇంతకుముందు 100% లవ్‌కి నాగార్జున ఎలాంటి ఛేంజెస్‌ చెప్పలేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English