మెగాస్టార్ 152.. ముహూర్తం కుదిరింది

మెగాస్టార్ 152.. ముహూర్తం కుదిరింది

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి రెండేళ్లు దాటింది. ఆయన పునరాగమన చిత్రం 'ఖైదీ నంబర్ 150' 2017 సంక్రాంతికి విడుదలైంది. తర్వాతి రెండేళ్లు ఆయన 'సైరా నరసింహారెడ్డి'కే అంకితం అయిపోయి ఉన్నారు. చిరు నుంచి ఇంత గ్యాప్ అభిమానులకు అసహనం తెప్పిస్తోంది. ముందు అనుకున్న ప్రకారం అయితే 'సైరా' గత ఏడాది దసరాకే రావాల్సింది.

తర్వాత ఈ ఏడాది వేసవికి అన్నారు. కానీ అప్పుడు కూడా సినిమా రాదని తేలిపోయింది. కొత్త టార్గెట్.. ఈ ఏడాది దసరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేటును అందుకోవాలని చూస్తున్నారు. సినిమా చిత్రీకరణ దాదాాపుగా చివరి దశకు వచ్చినట్లు చెబుతున్నారు. ఐతే 'సైరా' తర్వాత మాత్రం చిరు అభిమానుల్ని ఎక్కువగా నిరీక్షింప జేయకూడదని భావిస్తున్నాడు. చకచకా సినిమాలు చేయాలనుకుంటున్నాడు.

తన 152వ చిత్రాన్ని చిరు ఇప్పటికే కమిటైన సంగతి తెలిసిందే. హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో చిరు తన తర్వాతి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూన్‌లో సెట్స్ మీదికి వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'సైరా' షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని.. విదేశీ పర్యటనలో ఉన్న చిరు.. అక్కడి నుంచి వచ్చాక 'సైరా' బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తారట.

మేకల్లా 'సైరా'లో చిరు పని పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వాతి నెలలో కొరటాల శివ సినిమాను మొదలు పెట్టేస్తారట. రీఎంట్రీలో చిరు తొలి రెండు చిత్రాలను నిర్మించిన కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ఇందులో శ్రుతి హాసన్‌ను ఒక కథానాయికగా అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. దీని తర్వాత డీవీవీ దానయ్య నిర్మాణంలో త్రివిక్రమ్‌తో చిరు తన తర్వాతి సినిమా చేస్తాడని ఇంతకుముందే వెల్లడైన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English