సుకుమార్ సినిమా క్యాన్సిల్?

సుకుమార్ సినిమా క్యాన్సిల్?

దర్శకుడిగా కొంచెం పేరు రాగానే నిర్మాతలుగా మారిపోతున్నారు ఈ తరం దర్శకులు. కొంచెం పెద్ద స్థాయిని అందుకున్న వాళ్లయితే.. తమ అసిస్టెంట్లనే దర్శకులుగా పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ కోవలో ఇప్పుడు సుకుమార్ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. తన అసిస్టెంట్లతో ఆయన ఇప్పటికే ‘కుమారి 21 ఎఫ్’.. ‘దర్శకుడు’ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆయన ఇంకో ముగ్గురు నలుగురు అసిస్టెంట్లను దర్శకులుగా పరిచయం చేసే పనిలో ఉన్నాడు. అందులో ఒకరు బుచ్చిబాబు. మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజాను హీరోగా పెట్టి బుచ్చిబాబు తీయబోయే సినిమా కొన్ని నెలల కిందటే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తన మరో అసిస్టెంట్ కాశితో నాగశౌర్య హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశాడు సుక్కు. ఈ సినిమాను కూడా త్వరలోనే మొదలుపెట్టాలని చూస్తున్నాడు. కానీ ఈ చిత్రం క్యాన్సిల్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

కారణాలేంటన్నది తెలియదు కానీ.. నాగశౌర్య ఈ సినిమాను విడిచిపెట్టేశాడట. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో కమిటైన సినిమాను మొదలుపెట్టి దాని మీదే పూర్తిగా ఫోకస్ చేయాలని శౌర్య భావిస్తున్నాడట. గత ఏడాది ‘ఛలో’తో మంచి విజయాన్నందుకున్న శౌర్య.. ఆ తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాడు. స్క్రిప్టు మీద సరిగా దృష్టిపెట్టకుండా ‘నర్తనశాల’ అనే సినిమా చేస్తే దానికి దారుణమైన ఫలితం వచ్చింది.

సుక్కు అసిస్టెంట్ సినిమాకు స్క్రిప్టు విషయంలో అతను సంతృప్తి చెందకే మొహమాటానికి పోకుండా ఈ సినిమాను విడిచి పెట్టినట్లు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే ఒక క్లారిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు సుక్కు తన ప్రొడక్షన్లో ఇంకో రెండు మూడు సినిమాలకు సన్నాహాలు చేస్తున్నాడు. మొత్తంగా తన దగ్గరున్న అసిస్టెంట్లు అందరినీ దర్శకులుగా మార్చాలని సుక్కు చూస్తున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English