సైడ్‌ ప్లీజ్‌... ఇది 'సమంత' రాజ్యం

సైడ్‌ ప్లీజ్‌... ఇది 'సమంత' రాజ్యం

పెళ్లి అయిన తర్వాత సమంతకి పెద్ద సినిమాల్లో కథానాయకిగా నటించే అవకాశాన్ని ఎవరూ ఇవ్వడం లేదు. ఆమె నటన కొనసాగిస్తున్నా కానీ తోటి నటుడి భార్య అనో, అక్కినేని వారింటి కోడలనో సమంతకి పెద్ద అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో ఆమె తన స్పేస్‌ క్రియేట్‌ చేసుకుని తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటోంది. ఇటీవలే ఆమె నటించిన తమిళ చిత్రం 'సూపర్‌ డీలక్స్‌' రిలీజ్‌ అయి అందరి మన్ననలు అందుకుంటోంది. ఈ శుక్రవారం మజిలీ రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ఆమె 'ఓ బేబీ' అనే చిత్రంతో పాటు 96 రీమేక్‌లో నటిస్తోంది.

తాజాగా ఆమెకి నాని, సుధీర్‌బాబుతో దిల్‌ రాజు నిర్మిస్తోన్న వ్యూహంలో కథానాయికగా నటించే అవకాశం వచ్చింది. ఇందులో నెగెటివ్‌ షేడ్స్‌ వుండే పాత్ర చేస్తోన్న నానికి జోడీగా సమంత నటించనుంది. 'ఎటో వెళ్లిపోయింది మనసు' తర్వాత వీరిద్దరూ జంటగా నటించబోతున్న చిత్రమిదే. పెళ్లి అయినా కూడా గ్లామర్‌గా కనిపించడానికి తనకేమీ అభ్యంతరం లేదనే సంగతి ఇండస్ట్రీకి అర్థం కావాలనే ఆలోచనతో తరచుగా హాట్‌ ఫోటోలని సమంత అప్‌లోడ్‌ చేస్తోంది. అయితే ఆమెకి అలాంటి పాత్రలు పోషించే అవకాశం రాకపోయినా కానీ నటిగా తనని తాను రుజువు చేసుకునే పాత్రలయితే అలా వరుసగా వచ్చి పడిపోతూనే వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English