అంత పెద్ద షాక్ త‌ర్వాత పెద్ద ఛాన్సే..

అంత పెద్ద షాక్ త‌ర్వాత పెద్ద ఛాన్సే..

ఒక 'సేతు'.. ఒక 'నందా'.. ఒక 'పితామ‌గ‌న్'.. ఒక 'అవ‌న్ ఇవ‌న్'.. ఒక 'ప‌ర‌దేశి'.. ఇలా త‌మిళ ద‌ర్శ‌కుడు బాలా తీసిన చాలా సినిమాలు క్లాసిక్‌లే. చాలా త‌క్కువ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడిగా గొప్ప స్థాయిని అందుకున్నాడ‌త‌ను. మూణ్నాలుగు చిత్రాల‌తోనే అత‌ను లెజెండ‌రీ స్టేట‌స్ సంపాదించాడు. ఎన‌లేని గౌర‌వం తెచ్చుకున్నాడు. అలాంటి ద‌ర్శ‌కుడికి ఇటీవ‌ల ఘోర‌మైన అవ‌మానం జ‌రిగింది.

విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్‌ను హీరోగా పెట్టి అత‌ను తీసిన 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'వ‌ర్మ‌' నిర్మాణ సంస్థ చెత్త బుట్ట‌లో ప‌డేసింది. సినిమా అంతా పూర్త‌యి విడుద‌ల‌కు సిద్ధం అయ్యాక ఔట్ పుట్ బాలేదంటూ సినిమాను ప‌క్క‌న పెట్టేసింది. బాలా స్థాయి ద‌ర్శ‌కుడికి ఇది ఎంత పెద్ద ప‌రాభ‌వ‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఐతే ఈ వివాదాన్ని పెద్దది చేయ‌కుండా బాలా చాలా హుందాగా ప్ర‌వ‌ర్తించాడు.

ఈ వివాదం నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తున్న బాలా.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా త‌న కొత్త సినిమా మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నాడు. అత‌డికి బ్రేక్ ఇవ్వ‌డానికి సూర్య లాంటి పెద్ద హీరో ముందుకొచ్చాడు. గ‌తంలో 'నంద‌'.. 'పితామ‌గ‌న్‌' లాంటి సినిమాల‌తో సూర్య కెరీర్ ఎదుగుద‌ల‌లో బాలా కీల‌క పాత్ర పోషించాడు. ఆ సాయాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు క‌ష్ట‌కాలంలో ఉన్న బాలాను ఆదుకోవ‌డానికి సూర్య ముందుకొచ్చాడ‌ట‌. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చే ఏడాది సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

ప్ర‌స్తుతానికి ఓ లైన్ చెప్పి సూర్య నుంచి క‌మిట్మెంట్ తీసుకున్నాడు బాలా. ప్ర‌స్తుతం సూర్య "ఎన్జీకే"తో పాటు 'కాప్ప‌న్' అనే సినిమాను కూడా పూర్తి చేశాడు. సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లోనే ఓ సినిమా మొద‌లు పెడుతున్నాడు. దాని త‌ర్వాత బాలా సినిమా ఉండొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English