ర‌జ‌నీతో ప్ర‌భాస్ ఢీ

ర‌జ‌నీతో ప్ర‌భాస్ ఢీ

ముందు సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయినా.. తర్వాతి చిత్రానికి ఎంత క్రేజ్ ఉన్నా.. ఒక సినిమాకు ఇంకో సినిమాకు మధ్య ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుంటే అభిమానులు తట్టుకోలేరు. 'బాహుబలి' రెండు భాగాల కోసం ఐదేళ్లు వెచ్చించిన ప్రభాస్.. తర్వాతి సినిమా అయితే వేగంగా పూర్తి చేస్తాడనుకుంటే చాలా చాలా ఆలస్యం అయిపోయింది.

'బాహుబలి: ది కంక్లూజన్' రిలీజైన ఏడాదికి కానీ 'సాహో' మొదలుపెట్టని ప్రభాస్.. ఈ సినిమా మీదే ఏడాదిగా పని చేస్తున్నాడు. రాబోయే ఆగస్టులో 'సాహో' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఐతే ఈ సినిమాతో అభిమానుల్ని ఎక్కువ రోజులు నిరీక్షింపజేసిన ప్రభాస్.. తర్వాతి సినిమా విషయంలో మాత్రం ఇలా జరగకుండా చూసుకుంటున్నాడు. దాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించుకున్నాడు.

'సాహో' సెట్స్ మీద ఉండగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. చకచకా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 'సాహో' రిలీజైన నాలుగు నెలలకే ప్రేక్షకుల ముందుకు వస్తుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ పండక్కి బెర్తు బుక్ చేసుకున్న తొలి తెలుగు చిత్రమిదే. తమిళంలో కూడా భారీ చిత్రాలతో పోటీ పడాల్సి ఉంటుంది ఈ సినిమా. అందులో రజనీ-మురుగదాస్ సినిమా కూడా ఉండేట్లు క‌నిపిస్తోంది. బుజ్జిగాడు సినిమాలో ర‌జ‌నీకి వీరాభిమానిగా క‌నిపించిన ప్ర‌భాస్.. ఇప్పుడు ర‌జ‌నీతోనే బాక్సాఫీస్ పోటీకి దిగితే పోరు ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంది.

ఇప్పుడు ప్ర‌భాస్ ర‌జ‌నీ కంటే పెద్ద స్టార్ కావ‌డం విశేషం. కాబ‌ట్టి ప్ర‌భాస్ చిత్రాన్ని చూసి భ‌య‌ప‌డాల్సింది ర‌జ‌నీనే. 'సాహో' మాదిరే ఈ చిత్రాన్ని కూడా మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. దీనికి 'జాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్‌తో కలిసి కృష్ణం రాజు సంస్థ 'గోపీకృష్ణ మూవీస్' నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English