ఆమెని అక్కడ టచ్‌ చేసిన శ్రీదేవి భర్త... రచ్చ!

ఆమెని అక్కడ టచ్‌ చేసిన శ్రీదేవి భర్త... రచ్చ!

ఒక ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరయిన శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ తనతో పాటుగా వున్న నటి ఊర్వశి రౌతెలాతో కలిసి ఫోటోలకి ఫోజులిచ్చారు. ఫోటోలు అయిపోయిన తర్వాత ఆమెకి సెలవు చెబుతూ చనువుగా ఆమె పిరుదులపై చేతిలో నెమ్మదిగా తట్టారు. ఇది వీడియోలకి చిక్కడంతో తన కూతురు వయసున్న అమ్మాయితో అదేమి ప్రవర్తన అంటూ సోషల్‌ మీడియా ఆయనని ట్రోల్‌ చేస్తోంది. మీడియా కూడా బోనీ కపూర్‌ చర్యని ఎండగట్టింది. అయితే దీనిపై బోనీ వివరణ ఇచ్చుకునే లోపే ఆయనకి ఊర్వశి వత్తాసు పలికింది. ఆయన జెంటిల్మన్‌ అని, చిన్న విషయాన్ని ఎందుకింత రచ్చ చేస్తున్నారని ఆమె ఆయనని వెనకేసుకుని వస్తూ మీడియాకి గడ్డి పెట్టింది.

కానీ ఊర్వశిపై సోషల్‌ మీడియా యూజర్స్‌ ఎదురు దాడి చేస్తున్నారు. అవకాశాల కోసం ఇలాంటివి సహించే నీలాంటి వాళ్ల వల్లే చాలా మంది యువతులు మీటూ బారిన పడుతున్నారని, అతనో అగ్ర నిర్మాత కనుక అవకాశం ఇస్తాడని ఎక్కడ ముట్టుకున్నా ఊరుకుంటున్నావని, అతడి చర్యని అక్కడే గర్హించి వుంటే గౌరవం నిలుపుకునే దానివని, అతడిని సమర్ధిస్తూ నీ క్యారెక్టర్‌ దిగజార్చుకున్నావని ఊర్వశిపై ట్రోలింగ్‌ భారీ స్థాయిలో జరుగుతోంది. మరోవైపు బోనీ వీడియో ఇంటర్నెట్‌లో మహా వైరల్‌ అయిపోయి లక్షల కొద్దీ వ్యూస్‌ తెచ్చుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English