వైరల్‌ అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లవ్‌స్టోరీ!

వైరల్‌ అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లవ్‌స్టోరీ!

అజయ్‌ దేవ్‌గణ్‌తో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన 'దే దే ప్యార్‌ దే' మే 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రెయిలర్‌ నిన్న విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇప్పటికే అయిదు మిలియన్లకి పైగా వ్యూస్‌ సాధించిన ఈ ట్రెయిలర్‌లో స్టఫ్‌ అందరినీ ఆకర్షిస్తోంది. విడాకులు తీసుకున్న ఒక యాభై ఏళ్ల వ్యక్తితో పాతికేళ్ల రకుల్‌ ఒక రాత్రి గడుపుతుంది. అది వారిద్దరి నడుమ ప్రేమకి దారి తీస్తుంది. అంతవరకు బాగానే వుంటుంది కానీ అతను తన మాజీ భార్య ఇంటికి తన కొత్త ప్రేయసిని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పెద్ద కొడుకు వయసు కూడా రకుల్‌ వయసే.

అక్కడ్నుంచీ ఈ ట్రయాంగిల్‌ మరింత ఆసక్తికరంగా, కామెడీగా వుంటుంది. అజయ్‌ మాజీ భార్యగా టబు నటించిన ఈ చిత్రం టీజర్‌లో అడల్ట్‌ కామెడీ ఛాయలు బాగా వున్నాయి. అయితే ఈ ట్రెయిలర్‌ ఇన్‌స్టంట్‌గా హిట్‌ అవడంతో ఇది ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్‌ తెచ్చుకుంటుందనే నమ్మకం పెరిగింది. ఇటీవల యాక్షన్‌ పాత్రలు ఎక్కువగా చేస్తోన్న అజయ్‌ తన వయసుకి తగ్గ పాత్రలో పండించిన రొమాన్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో పాగా వేయడానికి రకుల్‌కి ఈ చిత్రం మంచి అవకాశాన్ని కల్పించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English