రకుల్ రేంజ్ తగ్గించుకుందే..

రకుల్ రేంజ్ తగ్గించుకుందే..

స్టార్ హీరోయిన్ అన్న ముద్ర వేయించుకున్నాక చిన్న-మీడియం రేంజి హీరోలతో జోడీ కట్టడానికి కథనాయికలు వెనుకంజ వేస్తారు. తమ స్థాయికి తగని హీరోలతో జత కడితే... తమ రేంజ్ పడిపోయిందని, తమ పనైపోయిందని కామెంట్లు పడతాయేమో అని భయపడిపోతారు. కానీ కాలం కలిసి రానపుడు ఒక స్థాయి హీరోలతోనే సినిమాలు చేస్తామని పట్టుబట్టి కూర్చుంటే మొదటికి మోసం వస్తుందని తెలుసు. అందుకే కొంచెం మెట్టు దిగి చిన్న, మీడియం రేంజి హీరోలతో జత కడుతుంటారు.

కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి వాళ్లు ఇలాగే తమ స్థాయి తగ్గించుకుని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌కు జోడీగా నటించిన సంగతి తెలిసిందే. అవకాశాలు తగ్గిపోతున్న దశలోనే కాజల్, తమన్నా కొంచెం రాజీ పడ్డారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ కూడా ఈ కోవలోనే నడుస్తోంది.

రకుల్ సైతం నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించడానికి అంగీకరించడం విశేషం. కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు మల్లిడి వేణు రూపొందించబోతున్న ‘తుగ్లక్’ సినిమాలో రకుల్‌ను కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం. రెండేళ్ల కిందటి వరకు మంచి స్థాయిలో ఉన్న రకుల్.. తర్వాత రేసులో వెనుకబడిపోయింది. ఏడాదిగా తెలుగులో ఆమెకు అవకాశాలే లేవు. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి నెట్టేశాయి.

ఈ దశలో తనకంటే రెట్టింపు వయసున్న సీనియర్ హీరో అక్కినేని నాగార్జునతో చేయడానికి ఆమె ఓకే చెప్పింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘మన్మథుడు-2’ రాబోతున్న సంగతి తెలిసిందే. చైతూకు జోడీగా నటించాక నాగ్‌తో జత కట్టడం విశేషమే. ఇక నందమూరి ఫ్యామిలీలో ఆల్రెడీ ఎన్టీఆర్‌తో జత కట్టి ఇప్పుడు అతడి అన్న కళ్యాణ్‌రామ్‌కు జోడీగా నటించబోతోంది. తమిళంలో రకుల్ నటించిన ‘ఎన్జీకే’ ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English