వర్షాలు పడ్డాక తారక్‌ షికార్లు

వర్షాలు పడ్డాక తారక్‌ షికార్లు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే ఒక ప్రత్యేకత, ఒక అభిమానం, ఒక ఫీల్‌. దానికి ఒక లెక్కుంది. రెండు రోజుల క్రితం 45 డిగ్రీల వేడిలో కూడా కనీసం రెస్ట్‌ తీసుకోకుండా, మండుటెండను లెక్క చెయ్యకుండా రామయ్య వస్తావయ్యా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు ఎన్టీఆర్‌. మండిపోతున్న సూర్యతాపాన్ని లెక్కచెయ్యకుండా మనోడు ఏకంగా ఫైట్‌ సీన్లలో పాలుపంచుకున్నాడు. సెప్టెంబర్‌లో సినిమాను రిలీజ్‌ చేద్దామని ముందుగానే ప్రకటించాడు కాబట్టి, ఖచ్చితంగా ఇలాంటి రిస్క్‌ తీసుకోవాలని ఫీలయ్యాడట.

అయితే మన మిగిలిన స్టార్లందరూ వేసవిలో హైదరాబాద్‌లో ఉండలేక సరదాగా యురోప్‌ చెక్కేశారు. కాని తారక్‌ మాత్రం వేసవిలో ఇక్కడే ఉండి, ఇప్పుడు చక్కగా తొలి చినుకులు పలకరించి త్వరలో వర్షాకాలం మొదలవుతున్న సమయంలో మనోడు మలేసియా వెళ్తున్నాడు. రామయ్య వస్తావయ్యా సినిమా షూటింగ్‌ నిమిత్తం ఏకంగా అక్కడ ఒక లాంగ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాడట దర్శకుడు హరీశ్‌ శంకర్‌. అయితే ఎండల్లో కూడా ఇంతబాగా కష్టపడి, సినిమాకోసం ఎన్టీఆర్‌ పడుతున్న తపన చూస్తుంటే ఎవరైనా అతన్ని లైక్‌ చెయ్యకుండా ఉండరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు