చెడగొట్టే పనిలో దిల్‌ రాజు!

చెడగొట్టే పనిలో దిల్‌ రాజు!

బొమ్మరిల్లు టైమ్‌లో రిస్కీ సబ్జెక్టులని ఎంచుకుంటూ కొత్త ట్రెండుకి శ్రీకారం చుట్టిన దిల్‌ రాజు ఈమధ్య చాలా కమర్షియల్‌ అయిపోయాడు. తీసిన ప్రతి సినిమాతో కోట్లు గడించాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే కొత్త తరహా కథలని ప్రోత్సహించలేకపోతున్నాడు. గత యేడాది రొటీన్‌ సినిమాలతో తగిలిన ఎదురు దెబ్బలతో రియలైజ్‌ అయి మళ్లీ అభిరుచి వున్న సినిమాలు తీయాలని సంకల్పించాడు. ఈలోగా ఎఫ్‌2 రిలీజ్‌ అయి పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవడంతో మళ్లీ తన సినిమాలకి కమర్షియల్‌ ఫార్ములానే కావాలంటున్నాడు.

ఎంతో ఇష్టపడి రీమేక్‌ రైట్స్‌ తీసుకున్న 96ని యథాతథంగా రీమేక్‌ చేయకుండా దానికి రిపేర్లు చేయాలని చూస్తున్నాడు. ఆ చిత్రం కాస్త నెమ్మదిగా సాగుతూ ఫీల్‌ గుడ్‌ అనుభూతిని ఇస్తుంది. తెలుగు ప్రేక్షకులు అలాంటి స్లో సినిమాలు చూడరని, మరీ అంత క్లాస్‌గా వున్న క్లయిమాక్స్‌ని హర్షించరని దానిని మార్చమంటూ దర్శకుడిపై ఒత్తిడి పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు పలుమార్లు దిల్‌ రాజుతో వాదనకి దిగి తన మాట నెగ్గించుకున్న దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ తాను ప్రేమించి తీసుకున్న 96ని ఆ ఆత్మ చెడకుండా తెలుగు వారి ముందుకి సుకుని రాగలడా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English