నాని కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

నాని కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

గత ఏడాది ఒకటికి రెండు ఫ్లాపులు తిన్నప్పటికీ నేచురల్ స్టార్ నాని ఊపేమీ తగ్గలేదు. చకచకా ‘జెర్సీ’ సినిమా పూర్తి చేసి.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో  సినిమాను కూడా జెట్ స్పీడుతో లాగించేస్తున్నాడు. దీని తర్వాత నాని ఒక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్లో నటిస్తున్నాడు. తనకు ‘అష్టాచెమ్మా’తో లైఫ్ ఇచ్చి.. ఆపై ‘జెంటిల్‌మన్’తో మరో హిట్ అందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేస్తున్నాడు. ఐతే ఇందులో నాని హీరో కాదు.

సుధీర్ బాబు కథానాయకుడిగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో నాని ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకపోయినా సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ‘జెంటిల్‌మన్’ తరహాలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా అంటున్నారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.

తన సినిమాలకు అచ్చ తెలుగు టైటిళ్లు పెట్టడం అలవాటైన ఇంద్రగంటి.. ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే పేరు ఖరారు చేశాడట. ఈ టైటిల్‌ను బట్టే సినిమాపై ఒక అంచనాకు రావచ్చు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ అంటున్నారు. ఇంద్రగంటి చివరగా చేసిన ‘సమ్మోహనం’లో సుధీర్ బాబే హీరో అన్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు కెరీర్లో దీన్ని ఒక మైలురాయిగా చెప్పొచ్చు. నటుడిగా అతడికి చాలా మంచి పేరు తెచ్చిందీ చిత్రం.

‘సమ్మోహనం’ తర్వాత ఒక స్టార్‌తో సినిమా చేయాలని ప్రయత్నించి.. చివరికి సుధీర్ బాబుతోనే సర్దుకుపోతున్నాడు ఇంద్రగంటి. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తాడని అంటున్నారు. ‘నన్ను దోచుకుందువటే’ తర్వాత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మీద తీయబోయే సినిమా చేయాలని అనుకున్నాడు సుధీర్. కానీ ఆ చిత్రం ఆలస్యం అవుతుండటంతో ఇంద్రగంటి సినిమాను లైన్లో పెట్టాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English