బన్నీ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. నిర్మాత రియాక్షన్

బన్నీ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. నిర్మాత రియాక్షన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరగా నటించిన 'నా పేరు సూర్య' గత ఏడాది వేసవికి విడుదలైంది. ఈపాటికి అతడి కొత్త సినిమా విడుదలకు ముస్తాబై ఉండాలి. కానీ ఇప్పటిదాకా మొదలే కాలేదు. తన కొత్త సినిమా అనౌన్స్ చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నాడతను. ఎట్టకేలకు మూడు నెలల కిందట త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉంటుందని ప్రకటించాడు.

కానీ అనౌన్స్‌మెంట్ తర్వాత చప్పుడే లేదు. సినిమా ప్రారంభోత్సవం గురించి అసలు ఏ సమాచారం లేదు. ఒక స్టార్ హీరో అభిమానులు ఇంత కాలం ఏ అప్‌డేట్ లేకుండా ఎదురు చూడాలంటే కష్టం. దీంతో బన్నీ ఫ్యాన్స్‌కు అసహనం వచ్చేసింది. అసలు ఈ సినిమా ఉందా లేదా అన్న సందేహాలు కలిగాయి వాళ్లకు. దీంతో సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ను బూతులు తిట్టడం మొదలుపెట్టారు. గతంలో 'సాహో' గురించి అప్ డేట్ ఇవ్వనందుకు యువి క్రియేషన్స్ మీద కూడా ఇలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో వాళ్లు స్పందించారు.

ఇప్పుడు రోజు రోజుకూ బన్నీ అభిమానుల్లో ఇలాగే అసహనం పెరిగిపోతుండటంతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్లు కూడా స్పందించక తప్పలేదు. బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా నడుస్తోందని.. ఆ పనంతా పూర్తయ్యాకే ఏ సమాచారమైనా అభిమానులతో పంచుకోగలమని సంస్థ ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించారు.

అభిమానులు ప్రతి ఒక్కరి ఫీలింగ్స్‌కి తాము ప్రాధాన్యం ఇస్తామని.. మళ్లీ త్రివిక్రమ్-బన్నీ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల అభిమానులు ఏ స్థాయిలో ఎగ్జైట్ అవుతున్నారో తాము కూడా అలాగే ఫీలవుతున్నామని.. కాబట్టి త్వరలోనే అన్ని అప్‌డేట్లూ ఇస్తామని.. ఆ రోజు వరకు ఎదురు చూడాలని హారిక సంస్థ ప్రకటించింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థతో కలిసి హారిక వాళ్లు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్లో కచ్చితంగా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందన్నది చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటించనున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English