సూపర్‌స్టార్‌ ఆ రేంజ్‌కి పడిపోయాడు

సూపర్‌స్టార్‌ ఆ రేంజ్‌కి పడిపోయాడు

ఒక్కసారి సూపర్‌స్టార్‌ అయితే ఇక ఎప్పటికీ సూపర్‌స్టారేనని, సూపర్‌స్టార్లని ఫ్లాపులు ఏమీ చేయలేవని చిత్ర పరిశ్రమలో బలంగా నమ్ముతారు. అయితే ఎంతటి సూపర్‌స్టార్‌ అయినా స్ట్రగుల్‌ అవుతాడని షారుక్‌ ఖాన్‌ని చూస్తే తెలుస్తుంది. జీరో ఫ్లాప్‌ అయిన తర్వాత షారుక్‌ బాగా షేక్‌ అయిపోయాడు. ఎంతో నమ్మి చేసిన ఈ చిత్రం అట్టర్‌ఫ్లాప్‌ అవడంతో షారుక్‌ డీలా పడిపోయాడు. ఇప్పట్లో ఏ సినిమా చేయనంటూ అంతకుముందు ఒప్పుకున్న సినిమాలు కూడా వదిలేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి సినిమా ఆఫర్లు కూడా రావడం లేదు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ షారుక్‌తో ఒక వెబ్‌ సిరీస్‌ చేయడానికి ముందుకొచ్చిందట. సినిమా స్టార్లు వెబ్‌ సిరీస్‌లు చేస్తే బాగా పాపులర్‌ అవుతాయి.

సేక్రెడ్‌ గేమ్స్‌ వెబ్‌ సిరీస్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలా షారుక్‌ ఖాన్‌తో వెబ్‌ సిరీస్‌ చేస్తే స్మాష్‌ హిట్‌ అవుతుందనే ఉద్దేశంతో అతడిని ఈ ఆఫర్‌తో సంప్రదించారట. కానీ ఈ ఆఫర్‌ యాక్సెప్ట్‌ చేస్తే షారుక్‌ ఇక సినిమా కెరియర్‌పై ఆశలు వదిలేసుకోవచ్చు. సేక్రెడ్‌ గేమ్స్‌ తర్వాత సైఫ్‌ నటించిన సినిమాలకి కనీస వసూళ్లు కూడా రావడం లేదు మరి. హాలీవుడ్‌లో అంటే వెబ్‌ సిరీస్‌లని చిన్న చూపు చూడరు కానీ ఇండియాలో మాత్రం సదరు నటుడి సీన్‌ అయిపోయిందనే అనేసుకుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English