పవన్‌ ఫాన్స్‌.... చరణ్‌ని తిట్టుకోకండి!

పవన్‌ ఫాన్స్‌.... చరణ్‌ని తిట్టుకోకండి!

బాబాయ్‌ వెంట ఎవరు వున్నా లేకున్నా తానుంటానంటూ చెప్పిన రామ్‌ చరణ్‌ ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతూ, పవన్‌పై ముప్పేట దాడి జరుగుతోంటే కనీసం మాట వరసకి అయినా మద్దతుగా మాట్లాడడం లేదని, బేసిక్‌ సపోర్ట్‌ కూడా ఇవ్వడం లేదని కొందరు పవన్‌ అభిమానులు గుర్రుగా వున్నారు. చరణ్‌ బర్త్‌డే ట్రెండింగ్స్‌ని కూడా కొందరు ఫాన్స్‌ బహిష్కరించారు. చిరంజీవి, చరణ్‌ ఇద్దరూ జనసేనకి ఎలాంటి మద్దతునివ్వకపోవడం ఫాన్స్‌కి రుచించడం లేదు.

అయితే తన రాజకీయ వ్యవహారాల గురించి సోషల్‌ మీడియాలో కానీ, మీడియాలో కానీ మాట్లాడవద్దని చరణ్‌కి పవన్‌ కళ్యాణే చెప్పినట్టు తెలిసింది. తాను చాలా పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందని, అంచేత తనకి చాలా మంది శత్రువులు తయారవుతారని, మెగా అభిమానులు అన్ని పార్టీలలోను వుంటారు కనుక వారిని హర్ట్‌ చేసేలా ప్రవర్తించరాదని పవన్‌ చెప్పాడట. తాను చేసే ఏ వ్యాఖ్యలయినా వివాదాస్పదమయితే అవి తమ చిత్రాలపై రిఫ్లెక్ట్‌ అవుతాయని, అంచేత కెరియర్‌ని ఇబ్బంది పెట్టుకునేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, ప్రచారానికి అసలే రావద్దని పవన్‌ ఖచ్చితంగా చెప్పాడట. అందుకే చరణ్‌ పూర్తిగా సైలెంట్‌ అయిపోయాడని ఇన్‌సైడ్‌ వర్గాల ద్వారా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English